• కమ్మనీచు కడిగినాపోదు, కాకినలుపు చిప్పపెట్టి గోకినాపోదు.
• కొండమీది గోలేమిటంటే కోమటివాళ్ళ రహస్యాలు.
• చెవిటి పెద్దమ్మా చేంతాడు తేవే అంటే చెవుల పోగులు నాజన్మానా ఎరగ నన్నదట..
• వైదికపు పిల్లీ వ్రత్తి పలకవే అంటే మావు మావు అందిట.
• అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
• పిట్ట కొంచెం కూత ఘనం
• అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
• వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
• అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
• కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
• అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
• మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
•ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
• ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
• ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
• ఆది లొనే హంస పాదు
• ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
• ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
• ఇంట గెలిచి రచ్చ గెలువు
• ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
• చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
• ఆరే దీపానికి వెలుగు యెక్కువ
• కందకు లేని దురద కత్తిపీటకెందుకు
• ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
•కోటి విద్యలూ కూటి కొరకే
• ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
• నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
• అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
•ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్టకి నిప్పు కావాలన్నడట ఒకడు
• నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
• మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
• మనిషి మర్మము.. మాను చేవ...బయటకు తెలియవు
•మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
• మొక్కై వంగనిది మానై వంగునా
• మొసేవానికి తెలుసు కావడి బరువు
• అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
• మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
• నడమంత్రపు సిరి నరాల మీద పుండు
•నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
•పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
• పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
• పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
• పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
• పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
• పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
• రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
•ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
• సిగ్గు విడిస్తే శ్రీరంగమే
• శుభం పలకరా మొగుడా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
•అక్కన్న మాదన్న గార్లు అందల మెక్కితే సాటిసరప్ప చెరువు గట్టెక్కాడు.
• ఏమి అప్పాజీ అంటే కాలంకొద్దీ రాయాజీ అన్నాడుట
•వండిన కుండ ఆగదు, సచ్చిన పీనుగు ఆగదు
•భయం లేనీ కోడి బజారు లో గుడ్డూ పెట్టిందట.
• ఎద్దు ఉన్నోడికి బుద్ధి ఉండదట బుద్ధి ఉన్నోడికి ఎద్దు ఉండద
•బీడి బిచ్చం కల్లు ఉద్దెర
•అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని
•ఆలి లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం..
• అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
• అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
• ఏ ఎండకు ఆ గొడుగు
• ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
• అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
• పాలుఇచ్చే బఱ్ఱెను అమ్మి, పైన ఎక్కే దున్నను తెచ్చుకొన్నట్లు.
•పాలు పిండగలము గానీ, తిరిగి చంటిలోకి ఎక్కించగలమా?
•పాలు పొంగడమంతా పొయ్యి పాలుకే.
•పాలు బోసి పెంచినా పాము కఱవక మానదు.
•పావలాకు పడుకుంటే, పందుం బియ్యం బేపి తినిపోయిందట.
•పిత్తులకు దడిసి పప్పు వండటం మానివేసినట్లు.
• పితు పిత్తు మంటే బియ్యానికి సరిసరి అన్నదట.
•పిత్తిన ముత్తయిదువలె.
•పిత్తి కంచం (నేల) గోకినట్లు.
•పిత్త సత్తువలేదు పాసనాలకు మందట.
•పిడుగు దాకిన పిదప కొరవి చూడినట్లు
•పిడుగుకు గొడుగు అడ్డమా?
•పిడికెడు బిచ్చం పెట్టలేనాతడు అడిగిందంతా యిచ్చునా?
•పిడతలో నూనె పిడతలోనే ఉండాలి, బిడ్డలు బీరగింజల్లా ఉండాలి.
•పిడకలు తీసుకరారా సువ్వా అంటే, నా పిక్కలు నొచ్చె అవ్వా అన్నాడట.
•పిఠాపుతం వెళ్ళి పిడతెడు నీళ్ళు తెచ్చినట్లు.
•పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు
•పిచ్చివానికి పింగుమీదనే ఆలాపన
•పిచ్చి కుదిరితేగానీ పెళ్ళికాదు, పెళ్ళి ఐతేగానీ పిచ్చికుదరదు.
•పిచ్చి కుదురింది, రోకలి తలకు చుట్టమన్నాడట.
•పిక్కలెగేయ బలిసినా దున్న ఏనుగు కాదు.
•పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది.
•పిండీ బెల్లం ఇచ్చి, పిన్నమా నీ ప్రసాదం అన్నట్లు.
•పిండికి తగ్గ పిడచ.
•పిండానికి గతిలేకపోయినా, పెగ్గెలకు లోటులేదు.
• పాసు ముండా! అంటే, పట్టుతల్లి అన్నట్లు.
•పాసిన గుమ్మడికాయ బాపనయ్యకు దానం ఇమ్మన్నట్లు.
•పాసిన కూడు పక్వానికి వస్తుందా?
•పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి.
•పాడి ఆవును దానం చేసి, పాలు తాను పితుక్కొన్నట్లు.
•పాతముండ కలవరిస్తే, కొత్తముండకు దయ్యం పట్టినట్లు.
•పానెం పాడైపోయినా, ప్రాణం కుదుట పడదు
•పాపమని పక్కటెముక ఇస్తే, పీక్కోలేక ఫిర్యాదు చేసినట్లు.
•పాపమని పాతచీర ఇస్తే, గోడ చాటుకు పోయి మూర వేసిందట.
•పాపమని పాలు పోస్తే, ఉడుకని ఉఱుకులాడిందట.
•పాపలేని ఇంట్లో, తాత తడివెళ్ళాడినట్లు.
•పాలసముద్రంలోని హంస పడియనీటి కాసపడుతుందా?
•పాలివాడు చస్తే పారెడు మన్నెక్కువ.
•పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు, మేనమామ పెండ్లాము మేనత్త కాదు.
•పిన్నమ్మ పెట్టకపోయినా, పోయకపోయినా నా మీద భలే ప్రాణం..
•పిఱికి వారికే పిడికెడంత మీసాలు..
•పిఱ్ఱల చప్పుడేగానీ దారి జరుగలేదు.
•పిఱ్ఱలు చూచి పీట వేసినట్లు..
•పిలవని పేరంటము, చెప్పని ఒక్క పొద్దు..
• పిలిచి పిల్లనిస్తా మంటే, మెల్ల అన్నాడట..
•పిలిచి పిల్లనిస్తా మంటే,అళ్ళుడు కొళ్ళొడు అయ్యిండట .
•పిలిచేవారుంటే బిగిశేవారు శానామంది..
•పిలువని పేరంటము, వలవని చెలిమి వంటిది..
•పీట పగిలేటట్లు, మొలత్రాడు తెగేటట్లు తింటేనే ప్రీతైన తిండి
•పీనుగ ఎక్కడో గద్దలూ అక్కడే.
•పీనుగమీద పిండాకుడు అన్నట్లు.
•పీయి తినే వాడింటికి చుట్టంపోతే, ఏరిగినదాకా తన్నినాడట.
•పీరుసాహేబు పింగు నాకుతుంటే అల్లీసాహేబుకు బెల్లమట.
• పీర్లు బచ్చాని కేడిస్తే, ముల్లా పంచదార కేడ్చినాడట.
•పుంటికూరలో పుడక రుచి, మాంసంలో ఎముక రుచి.
•పుండున్న వ్రేలికే పుల్ల తగులుతుంది.
•గుమ్మడికాయల దొంగా అంటే, భుజాలు తడుముకొన్నట్లు.
•పుచ్చిన మిరియాలకైనా జొన్నలు సరిరావు.
•పుచ్చిన విత్తులు చచ్చినా మొలువవు.
•పుచ్చుకున్నప్పుడు పుత్రుడు పుట్టినంత సంతోషం, ఇచ్చేటప్పుడు ఇంటాయన పోయినంత దుఃఖం.
•పుట్టంగ పురుడు, పెరగంగ పెళ్ళి.
•పుట్టని బిడ్డకు పూసలు కుట్టినట్లు.
•పుట్టమన్ను ఎరువైతే పుట్లకొద్ది పంట.
• పుట్టమీద తేలుకుట్టినా నాగుబాము కరచినట్లే.
•పుట్పుట్టుకతో వచ్చిన గుణం పుడకలతో గానీ పోదు.
•పుట్టిన పిల్లలు బువ్వ కేడిస్తే, అవ్వ మొగుడికేడ్చిందట.
•పుట్టు శాస్త్రులా? పెట్టుశాస్త్రులా?
•పుట్టెడు ఆముదము రాసుకొని పొర్లాడినా, అంటేదే అంటుతుంది, అంటంది అంటదు.
•పుడుతూ పుత్రులు, పెరుగుతూ శత్రువులు.
•పెంటకుప్ప పెరిగితే, పేదరైతు పెద్దవాడగును.
•పెంట తినే బఱ్ఱె, కొమ్ములు కోస్తె మానుతుందా?
• పెండ్లాము బెల్లము, తల్లి దయ్యము.
• పెండ్లికి వచ్చినవాళ్ళంతా పెళ్ళాలేనా?
•పెండ్లి కొచ్చినమ్మ పెదవు లెండినాయి అంటే, నీ వెన్నడొచ్చినావమ్మ నిలువుకండ్లు పడినాయి అన్నదట.
• పెండ్లికొడుకు కుంటి కుడికాలుచూచి అత్త ఏడుస్తుంటె ఏడ్పులో ఏడ్పు ఎడమకాలుగూడా చూపమన్నాడట-తోటిపెండ్లికొడుకు.
•పెండ్లినాటి సౌఖ్యం లంఖణాలనాడు తలచుకొన్నట్లు.
•పెండ్లిని చూస్తు ఒకడుంటే పెండ్లాన్ని చూస్తూ ఒకడున్నాడు.
•పెట్టనమ్మ పెట్టనే పెట్టదు, పెట్టేముండ కేమొచ్చింది పెద్దరోగం?
•పెట్టనేరని రండ పెక్కు నీతులకు పెద్ద.
•పెట్టితే తినేవారేగానీ, తిడితే పడేవారు లేరు.
•పెట్టినమ్మకు ప్రాణహాని, పెట్టనమ్మకు జన్మహాని.
•పెడద్రానికి, పెద్దరోగానికి మందులేదు
•పెత్తనం చేసేవాడు, పెంటి సంతానం కలవాదు అందరికీ లోకువే.
•పెత్తర అమావాశ్యకు పెద్దరొట్టె ఇస్తా నన్నాడు
•పెద్ద ఇంటి ఱంకు, పెద్దచెఱువు కంపు తెలియవు.
•పెద్ద ఇంటి ఱంకు, పెద్దమనిషి బొంకు తెలియవు.
•పెద్దకోడలికి పెత్తనమిస్తే ముడ్డి కడుక్కోకుండా (పీతిగుద్దతో) ఇంట్లోకి వచ్చిందట.
•పెద్దమ్మా! నీవెక్కడికంటే, చిన్నమ్మా నీవెనుకే ఉంటానన్నదట.
• పెద్దరికానికి పెద్దబావ చస్తే, ఇంటిల్లిపాది ఈడ్వలేక చచ్చిందట.
• పెద్దల ఉసురు పెనుబామై తగులును.
•పెద్దలు లేని ఇల్లు, సిద్ధులులేని మఠము.
•పెద్దుభోట్లూ, పెద్దుభోట్లూ! సన్యాసంతీసుకుంటావా? అంటే, పెండ్లాము చెప్పుతో మాడున కొడితే తీసుకోక తప్పుతుందా? అన్నాడట.
•పెయ్యను కాపాడమని పెద్దపులికి అప్పచెప్పినట్లు.
•పెరుగగా పెరుగగా పెదబావగారు కోతి అయినట్లు.
•పెరుమాళ్ళకైనా పెట్టువాడే చుట్టం.
•పేదవానికి పెండ్లామే లంజ.
•పేదవాని పెళ్ళాం వాడకెల్ల వదిన.
• పేదవాని స్నేహం, మహారాజువిరోధం సహింపరానివి
•పేనుకు పెత్తనమిస్తే, యిరవైచోట్ల యీనిందట.
•పైతళ్ళుక్కయితే పడరానిపాట్లు పడవచ్చును గానీ, మొగం ముడతలుపడితే చేసే దేమున్నది?
• పైన మంట, కింద మంట, కడుపులో మంత, కాలు నిలిపితే ఖామందు తంట.
•పైసా! పైసా! ఏం జేస్తావంటే, ప్రాణంవంటి మిత్రుణ్ణి పగ చేస్తానందిట.
•పొంకణాల పోతిరెడ్డికి ముప్ఫైమూడు దొడ్లు, మూడు ఎడ్లు.
• పొదుగు కోసి పాలు తాగినట్లు.
• పొదుగులేని ఆవు పాలిస్తుంటే, నాలికలేని పిల్లి నాకేసిందట.
•పొదుగెంత జారినా కుక్క గోవు కాదు.
• అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
• అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
• బతికుంటే బలుసాకు తినవచ్చు
• చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
• అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
• గతి లేనమ్మకు గంజే పానకం
• చింత చచ్చినా పులుపు చావ లేదు
• గోరు చుట్టు మీద రోకలి పోటు
• గాజుల బేరం భోజనానికి సరి
• గుడ్డి యెద్దు చేలో పడినట్లు
• కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
• . గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
• కంచే చేను మేసినట్లు
• . గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
• కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
• గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
• కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
•గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
• కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
•పంటచేను విడచి పరిగ ఏరినట్లు
•పంట పెంటలో ఉన్నది, పాడి పురిలో ఉన్నది.
•పంటిపాచి పోయిన యింటిహీనం పోతుంది.
•పండని ఏడు పాటు ఎక్కువ.
•పండని కోర్కెలే బొంకులు.
•పండుగనాడు కూడా పాత మొగుడేనా?.
•పంది ఎంత బలిసినా నంది కాదు.
•పందికేమి తెలుసురా పన్నీరు వాసన?
•పందికొక్కును పాతరలో పెడితే ఊరుకుంటుందా?
•పందిగా పదేళ్ళు బ్రతికేకన్నా నందిగా నాలుగేండ్లు (బతికేది మేలు) బతికితే చాలు.
•పంది పాత అప్పులు తీరుస్తుంది, కోడి కొత్త అప్పులు తీరుస్తుంది.
•పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?
•పందిమాదిరి కుక్కను మేపి, దొంగలొస్తే ఆలుమగలే అరచినారట.
•పందిరి ఇల్లు కాదు, పరదేశి మొగుడు కాదు.
•పందిరి పడి చచ్చినవారు, ఇల్లు పడి బ్రతికినవారు లేరు.
•పందిరే పర్వతము, ఇల్లే ఇంద్రలోకము.
•పందిలాగా కని, పరగళ్ళమ్మ పాలు చేసినట్లు.
•పగ గలిగి బ్రతకటం, పామున్న ఇంట్లో పడుకోవటం ఒక్కటే.
•పగడములేని ఇల్లు, జగడము లేని ఇల్లు ఉండవు.
•పగతో పొరుగిల్లు కాల్చవచ్చును గానీ, తన ఇల్లు కాపాడ తరముగాదు.
• పచ్చికంకులోయి దాసరీ అంటే రాలినకాడికే రామార్పణం అన్నాడట.
•పచ్చికాయ తుంచిన పండవుతుందా?
•పచ్చికుండలో నీళ్ళుపోయి, నీ పాతివ్రత్యం తెలుస్తుంది అన్నట్లు.
•పచ్చికంకులే దాసరీ, అంటే రాలినకాడికే గోవిందా అన్నాట్ట!
•పచ్చని వరహా కంటే, పుచ్చిన గింజే మేలు.
•పచ్చని పైకము గుఱ్ఱము చచ్చినదాకానే.
•పచ్చగా ఉంటే పారాడేది, వెచ్చగా ఉంటే వెళ్ళిపోయేది.
•పగవాని ఇంట ఫది బిచ్చాలు పోయినా పోయినవేను.
•పగవాణ్ణి పంచాంగ మడిగితే, మధ్యహ్నానికి మరణ మన్నాడట
•పగలు పప్పేసిన పయ్యెందుకు పగులు పెండ్లామా? నిత్య బూరెలు చేస్తే నిన్నెందుకు కొడుదు పెండ్లామా?
•పగలు నిద్ర పనిచేటు, మాపు జాగారణపై చేటు.
•అంబలి తాగే వాడికి మీసాలు ఎగబెట్టే వాడు ఒకడు..
•తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందంట.
•ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి
•కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడగొట్టింది
•బెల్లం ఉందా అంటే అల్లం ఉంది అన్నాడు అట
•మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టు
•పంచపాండవులంటే నాకు తెలియదా? మంచపుకోళ్ళ వలె ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట
• పంచమినాడు పల్లకి ఎక్కనూ లేదు, అష్టమి నాడు జోలి పట్టనూ లేదు.
•పంచశుభం పంచాశుభం.
•పంచాంగం పోగానే నక్షత్రాలు ఊడిపోతాయా?
•పంజకు ధైర్యము, కల్లుముంతకు ఎంగిలి లేవు.
•పంజరం అందంగా ఉంటే, పక్షికి సంతోషమా?
•పంజరంలో కాకిని పెట్టగానే పంచమస్వరం ఆలపిస్తుందా?
•పంటకు రాని చేలు, పరిభావ మెరుంగగలేనిని ఆలు.
•పంటకు పెంట, వంటకు మంట.
•పచ్చని పందిట్లో పట్టుకున్న పిశాచి ఎక్కడికీ పోదు
•పట్టినవాడు తాబేలు అంటే, గట్టునున్నవాడు కుందేలు అన్నట్లు.
•పట్టినవాడు పక్కి అంటే, గట్టునున్నవాడు జెల్ల అన్నట్లు
•పట్టుగుడ్డకు, భ్రష్టుముండకు అంటులేదు.
•పట్నం పోయి పుట్నం గింజ తెచ్చాడన్నట్లు.
•పఠానులకు నేను బాకీ, ఫకీరులు నాకు బాకీ.
•పడిలేస్తే పాతరలోతు తెలుస్తుంది.
•పడిశము పది రోగాల పెట్టు.
•పడుకోవడం పాతగోడలలో, కలవరింతలు మిద్దెటిండ్లలో.
• పడుగు పేకా కలిస్తే గుడ్డ, ఆలుమగడు కలిస్తే ఇల్లు.
•పడుచుగుంట, కడుపుమంట.
•పడుచు సేద్యం పాకానికి రాదు.
•పత్తిగింజల గంత కట్టనా బసవన్నా! అంటే ఊహూ అన్నాడట.
•పథ్యం చెడరాదు, సత్యం తప్పరాదు
• పనికి పీనుగు, తిండికి ఏనుగు.
•పని గలవాడు పందిరి వేస్తే, కుక్కతోక తగిలి కూలిపోయిందట.
•పని చేయనివాడు ఇంటికి దొంగ, పన్నివ్వనివాడు దివాణానికి దొంగ.
• పనిలేని పాపరాజు ఎంచేస్తున్నాడంటే, కుందేటికొమ్ముకు రేకలు తీస్తున్నడు అన్నట్లు.
•పరు విచ్చి పరువు తెచ్చుకొ.
•పరువు తప్పిన బ్రతుకు రోత, సతికిచాలని పురుషుని బ్రతుకు రోత.
•పరువులేని నడపీనుగకు ఊరేమి? పాడేమి?
•పల్నాటిలో పోకకు పుట్టెడు దొరికితే, ఆ పోక దొరకక పొర్లి పొర్లి ఏడ్చిందట.
• పల్లము దున్నినవాడు పల్లకి ఎక్కుతాడు.
•పల్లెతిరిగినా ఏడేచీరలు, పట్నం తిరిగినా ఏడేచీరలు.
•పశువు వచ్చిన వేళ, పడుచు వచ్చిన వేళ.
•పసుపు ఇదిగో అంటే ముసుగు ఇదిగో అన్నట్లు.
•పసుపూ బొట్టు పెట్టి పెండ్లికి పిలిస్తే వెళ్ళక, పెంకు పట్టుకొని పులుసుకు వెళ్ళిందట.
•పక్షిమీద గురిపెట్టి పందిని ఏసినట్లు
•పాకనాటి పతివ్రత లాగ.
•పాకీదానితో సరసం కంటే, అత్తరుసాహేబుతో కలహం మేలు.
•పాచికూట్లో కలిపోస్తే పదునుకు వచ్చునా?
•పాచిపండ్ల వాడు పేర్చి పెడితే, బంగారు పండ్ల వాడు బరుక్కతిన్నాడట.
• పాచిముండ పర్వతం బోతే (శ్రీశైలం) ఎక్కనూ దిగనూ దప్ప ఏమీ మిగలలేదట.
•పాచ్చాసాహేబు కూతురైనా, పెండ్లికొడుక్కి పెండ్లామే.
•పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం.
•పాటుకు కోడెదూడ, కూటికి పాడిదూడ
• పిల్లకాకి కేమి తెలుసు ఉండేలుదెబ్బ..
•పిల్లకు ఏమిపెట్టి పంపినారు శాస్త్రిగారు అంటే- పేదవాళ్ళము ఏమి పెట్టగలము? మీబోటి మహరాజులైతే వేలుబెట్టి పంపుతారు అన్నాడట..
•పిల్ల కుదిరినా కుదరకపోయినా వచ్చే నెలలో పెండ్లి నిజమన్నాడట.
•పిల్లకు సొమ్ము పెట్టిచూడు, గోడకు సున్నము కొట్టి చూడు..
•పిల్ల గలవాడు పిల్ల కేడిస్తే, కాతిగలవాడు కాసు కేడ్చాడట..
•పిల్ల చచ్చినా పురిటికంపు (పీతికంపు) పోలేదు..
•పిల్ల నిచ్చిన చోటికి, పీతిరిదొడ్డీకి పోక తప్పుతుందా?.
•పిల్ల పుట్టకముందే కుల్లగుట్టినట్లు..
•పిల్ల బావిలో పడ్డదిరా అంటే, ఉండు! అంబలి తాగివస్తానన్నట్లు..
• పిల్ల ముడ్డి గిల్లి (ఉయ్యాల ఊచినట్లు) జోలపాడినట్లు
•పిల్ల ముద్దుగానీ పియ్యి ముద్దా?
•పిల్లలున్న వాడికి, పసులున్నవాడికి సిగ్గుండరాదు.
•పిల్లలు లేని ఇంట్లో తాత తడుము లాడినట్లు.
•పిల్లలు లేనిది ఇల్లు కాదు, పిట్టలు లేనిది తోపు కాదు.
•పిల్లవాడు మూలా నక్షత్రంలో పుడితే, మూల పీకివేసుకుపోతాడట.
•పిల్లవానికి పీట వేసి, పిల్లకు చేట వేసినట్లు.
•పిల్లా పిలగానికి పెళ్ళిచేస్తే, ఎలేసి (వెలివేసి) ఎడం చేశాడట.
•పిల్లా! పిల్లా! నువ్వుల చెట్టుకు నూనె ఎక్కడిదంటే, మాఅమ్మ తొలి సమర్తకీ, మలి సమర్తకీ ఎక్కడున్నావు అందట.
•పిల్లి ఉట్టిచేరులు తెంచగలదు గానీ పాలకుండ పడకుండా (పట్ట)చేయగలదా?
•పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం.
•పిల్లికి రొయ్యలమొలతాడు కట్టినట్లు.
• పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకదు.
•పిల్లి తోక ఎద్దు ముట్టితే, ఎలుక దిక్కు ఎఱ్ఱగించి చూచిందట.
•పిల్లిని చంపిన పాపం నీది, బెల్లంతిన్న పాపం నాది.
•పొద్దుపొడుపున వచ్చిన వాన, పొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు.
•పొమ్మనలేక పొగ బెట్టినట్లు.
•పొయింది పోగా, పిడకల కుచ్చెల బట్టుకొని ఏడ్చినట్లు.
•పొయ్యలు చెడ్డదినంలో వేయాలి, పెండ్లిండ్లు మంచిదినంలో చేయాలి.
•పొయి అరిస్తే బంధువుల రాక - కుక్క అరిస్తే కఱవు రాక.
•పొరుగుది అట్లు పోసితే, ఇంటిది పోరెలు పోస్తుంది.
•పొరుగూరును నమ్ముకోగాక పొద్దుమునగ పండుకోబాక.
•పొరుగూరు చాకిరి, పొరుగూరి వ్యవసాయం, తనను తినేవే గానీ, తాను తినేవి కావు.
•పోకముడి విప్పుతూ, కోక వెల అడిగినట్లు.
•పోకలు నమలుచు ఆకులు చేబూని సున్న మడుగువాడు శుద్ధవెధవ.
•పోరాని చోట్లకు పోతే రారాని నిందలు రాక మానవు.
•పోరు గాలితో దీపంబెట్టి నా పాతివ్రత్య మహిమ అన్నట్లు.
•పోరు చాలక పొయ్యిదగ్గఱ పండుకుంటే, బొంతకాలిపోయె నారాయణా!
•పోలికి వచ్చిన భోగానికి, పొట్టేలుకు వచ్చిన రోగానికి తిరుగులేదు.
•పోలీ, పోలీ, నీ భోగమెన్నాళ్ళే? అంటే, మా అత్త మాలపల్లి నించి వచ్చేదాకా అన్నదిట.
•పోలేరమ్మకు పోయేది లేదు, పోతురాజుకు వచ్చేదీ లేదు.
•ప్రతిష్ఠకు పెద్దనాయడు చస్తే, ఈడవలేక ఇంటిల్లిపాదీ చచ్చారట.
• ప్రథమ చుంబనం - దంత భగ్నం. (మొదటి ముద్దుకే మూతిపండ్లు రాలినవి).
•దక్షిణలు చేస్తే, బిడ్డలు పుడుతారంటే, చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట.
• ప్రియములేని కూడు పిండపు కూడురా.
•ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు.