అయోధ్య రామునికి విరాళాలు ఇవ్వొద్దు: టీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

1/21/2021
టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారు. నియోజవర్గంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు.. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటకానికి తెర లేపుతున్నారంటూ బీజేపీని ఉద్దేశించి అన్నారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా.. తామంతా శ్రీరాముని భక్తులమేనని వ్యాఖ్యానించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వ్యాఖ్యలపై రామ భక్తులు, హిందూసంఘాల నేతలు మండి పడుతున్నారు. 


In Result: జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగరరావు వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందువులు.
మెట్ పల్లి పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే విద్యాసాగరరావు దిష్టిబొమ్మ దహనం .

More news

Related News

-Next--Last