చరిత్ర సృష్టించిన టీమిండియా.. 32 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్

1/19/2021
గబ్బా వేదికగా జరిగిన మైదానంలో భారత్ విజయం సాధించడంతో ఆసీస్ రికార్డు చెల్లాచెదురైంది. బ్రిస్బేన్‌లో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓటమి చెందింది. ఆసీస్‌ గడ్డపై ఈ రికార్డుకు బ్రేకులు చేసిన భారత జట్టు కు ఇతర జట్ల ఆటగాళ్లు అభినందనలు తెలుపుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన చివరి టెస్టులో మరో 18 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది. 

తొలుత ఓపెనర్ రోహిత్ శర్మ(7) త్వరగా ఔటైనా శుభ్‌మన్‌ గిల్‌(91; 146 బంతుల్లో 8 ఫోర్లు ,2 సిక్సర్లు), చటేశ్వర్ పుజారా(56; 211 బంతుల్లో 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కీలక సమయాల్లో ఔట్ అవుతాడని విమర్శలు ఎదుర్కొనే రిషబ్ పంత్ (89నాటౌట్‌; 138 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) బ్రిస్బేన్ టెస్టులో ఓపికగా ఆడుతూ జట్టును గెలిపించడంతో పాటు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని అందించాడు. 

More news

Related News

-Next--Last