వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వేధింపులు: బలవన్మరణానికి పాల్పడ్డ జనసేన కార్యకర్త

1/18/2021
జనసేన కార్యకర్త ఒకరు, వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జనసైనికుడు బండ్ల వెంకయ్యనాయుడు బలవన్మరణానికి పాల్పడటం బాధాకరమనీ, అధికార పార్టీ నేతల వేదింపుల కారణంగా జనసైనికుడు ప్రాణాలు కోల్పోయాడనీ, ఈ ఘటనపై తక్షణం పోలీసు అధికారులు స్పందించి, జనసైనికుడి మృతికి కారణమైన ఎమ్మెల్యేపైనా, ఇతర అధికార పార్టీ నేతలపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసైనికుడు బండ్ల వెంకయ్యనాయుడు, స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించడంతో, జనసైనికుడిపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్రస్థాయిలో దూషణలకు దిగారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజా ప్రతినిథి అయి వుండి, సభ్య సమాజం సిగ్గుపడే స్థాయిలో అసభ్య పదజాలాన్ని ప్రజా ప్రతినిథి తన మీద ప్రయోగించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన జనసైనికుడు బండ్ల వెంకయ్యనాయుడు బలవన్మరణానికి పాల్పడినట్లు జనసేన పార్టీ చెబుతోంది.

జనసైనికుడు వెంకయ్యనాయుడు కుటుంబానికి అండగా వుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వెంకయ్యనాయుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

More news

Related News

-Next--Last