ఈజిప్ట్ తవ్వకాల్లో 3వేల ఏళ్ల నాటి శవపేటిక, ఆలయం, మాస్క్ లు, ఆటవస్తులు

1/18/2021
అతిపురాతనమైన సంస్కృతి సంప్రదాయం గల దేశం ఈజిప్ట్. ఈ దేశ గురించి మనం తలచుకోగానే వెంటనే గుర్తుకొచ్చేవి మమ్మీలు, పిరమిడ్లు. ఎన్నివేల సంవత్సరాలైనా చెక్కుచెదరని పిరమిడ్ కట్టడాల గురించి నాగరికతకు జన్మస్థానంగా భావిస్తున్న ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

Egypt unveils 3,000-year old coffins in latest discovery at Saqqara necropolis south of Cairo: https://bit.ly/3bO33Yz

సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్‌లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనల్లో ఓల్డ్‌ కింగ్‌డమ్ ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్‌ సమీపంలో ఓ పురాతన శవపేటికను, పురాతన ఆలయాన్ని గుర్తించింది.

More news

Related News

-Next--Last