హిందు మతం త్వరలో కనుమరుగు అవనుందా?

1/15/2021
హిందూ మతం ఇన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేస్తూ నిరంతరం మనుగడ సాగించిన నేపధ్యంలో మిగతా మతాల్లాగా  హిందూ మతం దాని ఉనికిని   ప్రమాదం లో పడిన సంఘటనలు ఉన్నాయా?   అంటే చాలానే ఉన్నాయి.. ఈ కాల గమనంలో ప్రపంచం మొత్తం మీద ఆయ దేశాల్లో/ప్రాంతాల్లో ఎన్నో మతాలు,సంస్క్రుతులు ముస్లీం,క్రిష్టియన్ల దాటికి అవి కను మరుగు అయ్యాయి.. 

జొరాష్ట్రియన్ మతం ప్రస్తుత ఇరాన్ ప్రాంతంలో హిందూ మతం లాగానే విస్తృత ప్రజాదరణ కలిగిన మతం . కానీ అతితక్కువ సమయం లో మొత్తం ప్రజలు ఇస్లాం లోకి మారారు. మిగిలిపోయిన మతస్తులు వివిధప్రాంతాలకు పారిపోయారు. అలా మనదేశం వచ్చిన వాళ్ళే పార్శీలు. ఇప్పటికీ ముంబై దాదర్ లో వాళ్ళ ఆరాధ్యదైవమైన అగ్ని దేవాలయాలు వున్నాయి. ఉన్న కొద్ది మంది  ముంబై, గుజరాత్ లోనే వున్నారు. ఆ విధంగా జొరాష్ట్రియన్ మతం కనుమరుగయింది. ఈజిప్ట్ లో కూడా పురాతన మతం వుండేది.ఫెటిసిజం,బహుదేవతారాధన,టోటెమిజం  ఇలా ఎన్నో రూపాల్లో వాళ్ళ మతం ఉండేది. క్రైస్తవం, ఆ తర్వాత ఇస్లాం విస్తరణతో ఆ మతం ఉనికిని కోల్పోయింది. గ్రీక్ లో అతి పురాతన మతం వుండేది. అదీ తన ఉనికిని కోల్పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం లోని అనేక ప్రాంతాల్లో అప్పుడున్న మతాలూ, విశ్వాసాలు తర్వాత వచ్చిన మతాల ధాటికి తట్టుకోలేక ఉనికిని కోల్పోయినాయి. అటువంటిదే యూదు మతం కూడా. తర్వాత వచ్చిన మతాల ధాటికి తట్టుకోలేక చెల్లాచెదరయిన యూదులు వెయ్యి సంవత్సరాలకు పైగా తమ అస్తిత్వాన్ని నిలుపుకొని ప్రస్తుతం తిరిగి తమ స్వంత ప్రదేశానికి చేరటం ఒక్కటే వీటన్నింటిలో మినహాయింపు. మరి ఇటువంటి పరిస్థితి హిందూ మతానికి వచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది.


భారతదేశం మీద ఇస్లాం మతం దాడి 

మొదటి ఖలీఫా ఉస్మాన్ ఖాన్ దగ్గర్నుంచి మొదలయ్యి ఔరంగజేబు వరకు  భారతదేశం మీద దాడుల పరంపర కొనసాగింది.  మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత వచ్చిన ఖలీఫాల కాలం లో మొత్తం పశ్చిమ ఆసియా , మధ్య ఆసియా , ఉత్తర ఆఫ్రికా , ఐబీరియా ద్వీపకల్పం అతి కొద్ది కాలం లోనే ఇస్లాం కిందకు వచ్చినా భారత ఉపఖండం ఆ విస్తరణను అడ్డుకుంది. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, రాజస్తాన్, లాంటి పశ్చిమ ప్రాంతాలన్నీ కూడా ఈ ప్రతిఘటనలో పాల్గొనటం తో భారత్ కి విస్తరణ ఆలస్యమయ్యింది. మహమ్మద్ బీన్ ఖాసిం తో మొదలయ్యి ఆ తర్వాత చానాళ్లకు మహమ్మద్ ఘోరితో విస్తరణ ప్రారంభమయ్యింది. అయినా మిగతా ప్రాంతాల లాగా భారత్ ప్రజలను మత మార్పిడి చేయలేకపోయారు. వెయ్యి ఏళ్ళు పరిపాలించినా మార్చగలిగింది కొద్ది శాతం మందినే. అదీ తర్వాత వచ్చిన సూఫీ మత ప్రవక్తల ద్వారానే. దీనికి అనేక కారణాలున్నా యి. ఒకటి  ఎప్పుడూ హిందూ రాజులతో యుద్ధాలు కొనసాగటం, బౌద్ధం లాగా మనసుల్ని గెలవటానికి ప్రయత్నం చేయక పోవటం , ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుండటం తో హిందూ సమాజం సమీకరించబడటం, హిందూ సమాజం రక్షణాత్మక చర్యలు చేపట్టటం లాంటి అనేక పరిణామాలు ఇస్లాం మత మార్పిడిని నిరోధించగలిగాయి. ఉదాహరణకు కుల స్థిరీకరణ ఈ కాలం లోనే జరిగింది. ఇది ఇస్లాం నుంచి రక్షణ కవచంగా ఉపయోగపడింది. అదే తర్వాత ఆధునిక సమాజం లో హిందూ మతానికి గుదిబండలా తయారయ్యింది.   
Demolish former Prime Minister P.V. Narasimha Rao, former AP CM NTR ghats: MIM MLA Akbaruddin Owaisi: https://bit.ly/3nTAzzw   ,  https://www.youtube.com/watch?v=7uMSkBgxJzM 

వీటితో పాటు చివరివరకు చాలా భూభాగాలు ఇస్లాం విస్తరణను అడ్డుకోవటం కూడా ఒక కారణం. ఉదాహరణకు ఈశాన్య భారతం లోకి విస్తరించాలని చేసిన ప్రయత్నం వందల సంవత్సరాలు  అస్సాం  రాజులు ప్రతిఘటించి ఎన్నో యుద్ధాలు, ఎన్నో వేలమంది మరణించినా ప్రతిఘటించ గలగటం తో అటువైపు విస్తరణ ఆగిపోయింది. అలాగే దక్షిణాదిన మొదట్లో కాకతీయులు,  యాదవరాజులు ప్రతిఘటించినా అది ఎక్కువకాలం నిలవలేదు. ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాలం లో దక్షిణాది లోపలి భాగాలకు    విస్తరించినా తర్వాతికాలం లో వచ్చిన 200 సంవత్సరాల విజయనగర రాజుల ప్రతిఘటన దక్షిణాదికి విస్తరించకుండా ఆపింది. అలాగే పశ్చిమం లో శివాజీ వీరోచిత ప్రతిఘటన అందరికీ తెలిసిందే. రాజస్తాన్ లోని మేవాడ్ రాజులు  దాదాపు వెయ్యేళ్ళు పోరాటాలు చేస్తూనే వచ్చారు. చివరకు మొఘలులు కూడా వాళ్ళను జయించలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం లో ఎప్పుడూ ఎక్కడోచోట ప్రతిఘటన జరుగుతూనే వుంది. వీటితోపాటు హిందూ రాజులు చాలా సార్లు ధర్మ యుద్ధం పేరుతో తీవ్ర నష్ట పోయారు. అలా కాకుండా గెరిల్లా పోరాటం చేసి విజయాలు నమోదు చేసుకుంది మహారాణా ప్రతాప్, శివాజీ లు. అలాగే కొంతమంది సనాతన వాదుల మూలంగా కూడా పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు కాశ్మీర్ లో 14 వ శతాబ్దం లో రించన సేనాపతి  అప్పటి రాజుని సంహరించి రాజ్యంతో పాటు తన కూతురు కోటా దేవి ని కూడా పెళ్ళాడాడు. ఆమె తనని హిందూ మతం స్వీకరించమని ఒత్తిడి చేస్తే అందుకు అతను సమ్మతించాడు. కానీ కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు తనని చేర్చుకోవటానికి మతం ఒప్పుకోదని నిరాకరించారు. దానితో అవమానంగా భావించి ఇస్లాం స్వీకరించి హిందూ దేవాలయాల్ని కూలగొట్టి , హిందువులను నానారకాల హింసలకు గురిచేశాడు. అలాగే 19 వ శతాబ్దం మొదట్లో పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ కాశ్మీర్ ని జయించిన తర్వాత బలవంతంగా మతం మారిన ఇస్లాం ప్రజల్ని తిరిగి హిందూ మతం లోకి ఆహ్వానించాడు. అప్పుడుకూడా కాశ్మీరీ బ్రాహ్మణ పండితులు, హిందూ ధర్మాచార్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా జరిగివుండకపోతే  కాశ్మీర్ చరిత్ర వేరేలాగా వుండేది. సనాతన వాదులు వాళ్ళ మూఢ ఆచారాల వలన ఇలా ఎన్నో సార్లు హిందూ మతానికి నష్టం చేకూర్చారు. అయినా హిందూ మతం రెండో సారి తన ఉనికిని కాపాడుకోగల్గింది . 

భారతదేశం మీద క్రైస్తవ  మతం దాడి    

దాడులు కాదు.హిందు మతాన్ని రూపు మాపే పనిలో క్రైస్తవులు  ...!     త్వరలో..
అప్పటి వరకు చరిత్ర ఎందుకు, ఇప్పుడు జరుగుతున్న హిందు మతం మీద క్రైస్తవుల దాడుల గురించి  ఈ లింక్ https://bit.ly/38JPhEn  క్లిక్ చేయండి.

More news

Related News

-Next--Last