ఏపీలో విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్టు

1/15/2021
హిందూ ఆలయాలలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసే కేసులో క్రిస్టియన్ మత ప్రచారకుడుఅరెస్టు అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ని పోలీసులు అరెస్టు చేశారు.
క్రీస్తు గ్రామాలను నెలకొల్పడమే లక్ష్యంగా పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై 153ఏ, 153బి, 1సి, 505, 295ఏ, 124ఏ, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలియవచ్చింది. ఆయనకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. 

అమెరికాలోని ఓ దాతతో ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన సంభాషణ ట్విట్టర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమ అసోసియేషన్‌లో మొత్తం 3,642 మంది పాస్టర్లు ఉన్నారని, ఇప్పటి వరకు 699 క్రీస్తు గ్రామాలను నెలకొల్పామని, మరో నెలలో 7 వందల గ్రామాలు పూర్తి చేస్తామని అమెరికాలోని దాతకు ప్రవీణ్ వివరించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Video Courtesy : ABN Andhra Jyothi

More news

Related News

-Next--Last