బర్డ్ ఫ్లూ భయం తో దేశ‌వ్యాప్తంగా ప‌డిపోయిన చికెన్ ధ‌ర‌లు

1/12/2021
దేశాన్ని బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది.  బర్డ్ ఫ్లూ వలన ఇప్పటికే వేలాది పక్షులు మృత్యువాత పట్టాయి. వలస పక్షులు, ఇతర పక్షులు, కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో అనేక రాష్ట్రాల్లో చికెన్ ధర ఒక్కసారిగా కిందకు పడిపోయింది.  బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్లు అమ్మకాలు భారీగా పడిపోయాయి.  దేశంలోని అనేక రాష్ట్రాల్లో ధరలు నేలకు దిగివచ్చాయి.  కరోనా సమయంలో భారీగా పెరిగిన ధరలు, బర్డ్ ఫ్లూ దెబ్బకు పడిపోయాయి. మహారాష్ట్రలో కేజీ చికెన్ ధర రూ.58 ఉంటె, గుజరాత్ లో కేజీ చికెన్ ధర రూ.65 ఉంది.  ఇక తమిళనాడులో కేజీ చికెన్ ధర రూ.70గా ఉన్నది.  దేశంలోని మిగతా రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు, అమ్మకాలు పడిపోతుంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధరలు నిలకడగా ఉండటం విశేషం.  

Other news

More News

-Next--Last