‘బుల్లెట్’లా దూసుకొస్తున్న బ్రిటిష్ మోటారు సైకిళ్లు.. మూతపడ్డ బ్రిటిష్ కంపెనీలను కొని, లాభాలు ఆర్జిస్తున్న భారతీయ సంస్థలు

1/12/2021
బ్రిటిష్ మోటార్ బైక్ బ్రాండు.. బీఎస్ఏ భారతీయ యాజమాన్య అధీనంలో సరికొత్త రూపం సంతరించుకుంటోంది. బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్ ఉత్పత్తులను విస్తృతంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలతో ఈ ఏడాది మొదట్లో భారతీయ సంస్థ టీవీఎస్.. నార్టన్‌ని కొనుగోలు చేసింది.భారతీయ యాజమాన్య నిర్వహణలో విజయాన్ని చవి చూస్తున్న చరిత్రాత్మక రాయల్ ఎన్‌ఫీల్డ్ అడుగు జాడల్లో నడిచేందుకు నార్టన్ సన్నద్ధం అవుతోంది.

వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్న పేరున్న బ్రాండ్లను లాభాల దిశగా పయనింప చేసేందుకు భారతీయ ఉత్పత్తిదారులు ఆసక్తి చూపడం పట్ల వ్యాపార నిపుణులు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయటం లేదు.బీఎస్ఏ బ్రాండు పేరుతో బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేసి బ్రిటిష్ మోటార్ బైక్ పరిశ్రమను పునరుద్ధరణ చేయాలని ఆశిస్తున్నట్లు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర చెప్పారు.

ఈ మోటార్ బైక్‌లను బర్మింగ్‌హామ్‌లో 2021 మధ్యకల్లా తయారు చేయడం మొదలు పెట్టాలని మహీంద్రా గ్రూపు భావిస్తోంది.కొత్తగా జీవం పోసుకున్న బీఎస్ఏ ఆక్స్‌ఫర్డ్ షైర్, బాన్బరిలో త్వరలోనే ఎలక్ట్రిక్ మోటార్ బైక్ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఒక పరిశోధనా కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఈ లోపు పెట్రోల్ ఇంజన్లతో నడిచే వాహనాలను తయారు చేస్తారు.

మోటార్ సైకిళ్ళ ఉత్పత్తిలో బ్రిటన్‌కున్న చరిత్రను బట్టి యూకేని పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నుకున్నట్లు ఆనంద్ మహీంద్ర చెప్పారు. ఆయన ఆస్తుల విలువ 1.7 వేల కోట్ల రూపాయలు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా వేసింది.బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) ని 1861లో స్థాపించారు. 1950 నాటికి ట్రైయంఫ్ , సన్ బీమ్ బ్రాండ్లకు కూడా యాజమాన్య బాధ్యతలు వహిస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే సంస్థగా బీఎస్ఏ నిలిచింది.

కానీ, ఈ సంస్థ ఆర్ధికంగా దివాళా తీయడంతో 1970ల నాటికి ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2016లో దానిని మహీంద్రా గ్రూపు కొనుగోలు చేసింది.

Other news

More News

-Next--Last