విద్యాసంస్థల ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు

1/12/2021
ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి స్కూల్స్ ను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  విద్యాసంస్థలు ప్రారంభంపై యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేశారు.  ఈనెల 18 వ తేదీలోగా యాక్షన్ ప్లాన్ ను ప్రభుత్వానికి అందజేయాలి.  ప్రతి విద్యాసంస్థను శానిటైజ్ చేయాలి.  అదే విధంగా విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.  విద్యార్థులు పాఠశాలకు హాజరు విషయంలో తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం తెలియజేసింది.  ఫిజికల్ గా స్కూల్స్ కు హాజరు కావాలని ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. హైస్కూల్ 9,10 తరగతులు రెగ్యులర్ స్కూల్ టైమింగ్స్ లోనే తరగతులను నిర్వహించాలని పేర్కొంది.  తరగతికి 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉండకూడదని ప్రభుత్వం పేర్కొంది.  హాజరు శాతం సరిపోలేదని విద్యార్థులను పరీక్షలకు నిరాకరించవద్దని ప్రభుత్వం సూచించింది.  ఇక ఇంటర్ కళాశాలలలొ విద్యార్థులు 300 మంది కన్నా తక్కువ ఉంటె ఒకటే షిఫ్ట్, 300 మందికన్నా ఎక్కువ మంది ఉంటె రెండు షిఫ్ట్స్ లో కళాశాలను రన్ చేయాలనీ సూచించింది.  ఇక తరగతి గదిలో 30 మందికంటే ఎక్కువమంది విద్యార్థులు ఉండకూడదని పేర్కొన్నది.  డిగ్రీ, పీజీ, ప్రొఫెషన్ కళాశాలల్లో తరగతి గదిలో 50 మందికి మించి ఉండకూడదని తెలిపింది.  10 వ తరగతి పరీక్షలు పూర్తయ్యే తేదీనే పాఠశాల విద్యాసంవత్సరం చివరి పనిదినం అని, ఏప్రిల్ 30న ఇంటర్మీడియట్ కి చివరి పనిదినం అని ప్రభుత్వం పేర్కొంది.  70శాతం సిలబస్ తోనే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొన్నది.  

More news

Related News

-Next--Last