41 దేశాలకు విష్తరించిన UK Corona Virus Strain

1/6/2021
ఇప్పటికే ఏడాది నుంచి కరోనా మహమ్మారి దేశవిదేశాలలో కల్లోలం సృష్టిస్తుంటే.. తాజాగా బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్తరకం ప్రపంచదేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి బ్రిటన్‌ను వణికిస్తోన్న‌ ఈ రకం వైరస్‌ ఇప్పటికే 41దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. “బ్రిటన్‌లో మొదటి సారిగా వెలుగులోకి వచ్చిన కోవ్‌-202012/01 రకం కరోనా వైరస్‌ జనవరి 5 కి దాదాపు 41 దేశాల్లో విస్తరించిందని”.. కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. ఇక “దక్షిణాఫ్రికాలో బయటపడ్డ 501.V2 రకం వైరస్‌ స్ట్రెయిట్ కంటే మరింత శక్తి శాలి అని.. మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఈ కొత్త కరోనాకు 501 డాట్‌వీ2గా నామకరణం చేసినట్లు తెలిపింది. ఈ వైరస్ కూడా ఆరు దేశాలకు వ్యాపించిందని” ప్రపంచఆరోగ్య సంస్థ ప్రకటించింది.

కోవిడ్ 19 తో పోలిస్తే స్ట్రెయిట్ 70శాతం వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచదేశాలు బ్రిటన్‌ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షలను మరికొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించాయి. అయితే బ్రిటన్‌ , దక్షిణ ఆఫ్రికా లో పుట్టిన కొత్త రకం వైరస్‌ లు కాకుండా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల కరోనా వైరస్‌లు బయటపడినట్లు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటిచింది.

More news

Related News

-Next--Last