విగ్రహాల విధ్వంసంపై చిన జీయర్ స్వామి ఆగ్రహం.. ఈనెల 17 నుంచి దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటన

1/5/2021
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరుగుతున్న వరుస దాడి ఘటనలపై త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో రక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని విజయ కీలాద్రిపై చిన జీయర్ స్వామీజీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉపద్రవాలు జరిగినపుడు ఉపశమనం కల్పించడంతోపాటు తక్షణ కర్తవ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏపీలో ఆలయాల ఉనికికి భంగం కలుగుతున్నపుడు మౌనంగా ఉండటం సరైంది కాదని అనిపించిందని… అందుకే.. ధనుర్మాసం పూర్తికాగానే ఓ క్రమంలో ఏయే ఆలయాలపై దాడులు జరిగాయో.. వాటన్నింటినీ సందర్శిస్తానని ఆయన ప్రకటించారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్రను చేపట్టనున్నట్లు చిన జీయర్ స్వామి వెల్లడించారు. ఆ సమయంలో అక్కడి ప్రజలతో మాట్లాడుతాను అని అన్నారు. అయితే ఏ ప్రాంతం నుంచి యాత్ర చేపట్టాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని, త్వరలోనే నిర్ణయించుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంటిలిజెన్స్ విభాగంతో స్పష్టమైన కమిటీ వేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.

More news

Related News

-Next--Last