కేరళలో అడుగుపెట్టిన బర్డ్ ఫ్లూ.. 12 వేల బాతులు మృతి

1/4/2021
రాజస్థాన్‌లో బర్డ్‌ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో తాజాగా కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. కేరళలోని అళపుళ, కొట్టాయం జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో 12వేలకు పైగా బాతులు మరణించినట్లు వెల్లడించారు. ఎనిమిది శాంపిళ్లను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపగా ఐదు శాంపిళ్లలో వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బర్డ్‌ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కిలోమీటరు పరిధిలో ఉన్న సుమారు 36వేల బాతులను వధించనున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని జల్‌మహల్‌ ప్రాంతంలో 252 కాకులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్‌లోనూ సుమారు 50 కాకులు మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ శాంపిళ్లను భోపాల్‌కు పంపినట్లు ఇండోర్‌ ప్రధాన ఆరోగ్యాధికారిణి పూర్ణిమ గదారియా తెలిపారు. 5 కిలోమీటర్లలోపు ఉన్న ఇతర పక్షుల్లో ఫ్లూను గుర్తించేందుకు సర్వేను చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

More news

Related News

-Next--Last