బ్రిటన్‌లో కరోనా విలయతాండవం.. గడిచిన 24 గంటల్లో ఆ దేశ వ్యాప్తంగా 53,285 పాజిటివ్‌ కేసులు

1/4/2021
బ్రిటన్‌ దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఆ దేశంలో కొత్తగా స్ట్రైయిన్‌ వైరస్‌ కేసులు బయట పడటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఆ దేశ వ్యాప్తంగా 53,285 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అక్కడి అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 25 లక్షలు దాటిపోయింది. అలాగే నిన్న ఒక్క రోజే 613 మంది కరోనాతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా వరుసగా 50 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. డిసెంబర్‌ 25 నుంచి ఇప్పటి వరకు 2.50 లక్షలకుపైగా మంది కరోనా బారిన పడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల పెరుగుదల రేటు 63 శాతం పెరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో చాలా ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వారం రోజులుగా కొత్త కేసులు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించారు. ప్రస్తుతం లండన్‌ దేశ వ్యాప్తంగా సుమారు 40 శాతం మంది టైర్‌-4 కోవిడ్‌ నిబంధనల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

More news

Related News

-Next--Last