Covid Vaccine.. Aadhar Number, OTP :ఏ రంగంలోనైనా మంచి జరగడానికంటే మోసాలు జరిగేందుకు ముందుగా ఆస్కారం ఉంటుంది. టైం దొరికిపోతే చాలు మోసగాళ్లు ఇట్టే దూరిపోతుంటారు. ప్రస్తుతం ఆధార్ నెంబర్లు, ఓటీపీలతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ ఆధార్ నెంబర్లు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవ్వరికి ఇవ్వవద్దని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలు ఎందుకు చేసిందంటే… దేశంలో అందుబాటులోకి వస్తున్న కరోనా వ్యాక్సిన్ కారణంగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ ఆధార్ నెంబర్ ప్రకారమే ఇస్తుండటంతో ముందుగా ఫోన్లు చేసి ఆధార్ నెంబర్ చెప్పాలని, దీంతో మీ నెంబర్కు ఓ ఓటీపీ వస్తుంది దానిని చెప్పాలని అడుగుతుంటారు. అలా అన్ని వివరాలు చెప్పేస్తే మీకు రావాల్సిన వ్యాక్సిన్ వంతు వాళ్లే తీసేసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
వ్యాక్సినేషన్ సందర్భంగా గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ హెల్త్ అఫీషియల్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంకా సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ఎటువంటి ప్రకటన చేయలేదని, తొలి దశలో ఫ్రంట్లైన్ యాంటీ కోవిడ్ వర్కర్లకు మాత్రమే పంపిణీ చేయనుందని తెలిపారు. అలాగే
గోరఖ్పూర్ సీఎంఓ డాక్టర్ శ్రీకాంత్ తివారీ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులంటూ కొందరు ఆధార్ నెంబర్లు, ఓటీపీ చెప్పాలని అడుగుతుంటారు… యాంటీ కోవడ్ వ్యాక్సిన్ గురించి రిజిష్టర్ చేసుకునేందుకు ఖచ్చితంగా ఇవ్వాలని చెబుతుంటారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రిక్రియలో భాగంగా ఎటువంటి వివరాలు ఇవ్వాల్సిన అవరం లేదని ఆయన స్పష్టం చేశారు.