ఈ రోజు జనసేన- బిజేపి విజయనగరం జిల్లా రామతీర్థ యాత్ర

1/3/2021
విజయనగరం జిల్లా రామతీర్థ ఆలయంలోని శ్రీరాముడి విగ్రహంను ద్వంసం చేసిన విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. రాష్ట్రంలో దేవాలయాలకు భద్రత లేకుండా పోయింది అంటూ విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఈ సమయంలోనే పలు పార్టీల నాయకులు రామతీర్థ యాత్ర చేపట్టారు.

నిన్న చంద్రబాబు నాయుడు మరియు విజయసాయి రెడ్డి రామతీర్థలో పర్యటించిన విషయం తెల్సిందే. ఇంకా పలు పార్టీల నాయకులు మరియు హిందూ సంఘాల వారు అక్కడ పర్యటిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా రామతీర్థలో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు.

రామతీర్థలో జనసేన ఈనెల 5వ తారీకున పర్యటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించింది. రామతీర్థ విగ్రహం ద్వంసంకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకోవాలంటూ జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది. రామ తీర్థలో జనసేన- బిజేపి పర్యటించబోతున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భారీ ఎత్తున రామతీర్థకు జనాలు తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అక్కడ ఆంక్షలు విధించారు. మరి జనసేన- బిజేపి కు అనుమతులు దక్కేనో లేదో చూడాలి.

More news

Related News

-Next--Last