విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న సీతారామ మందిరంలో ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంసం..

1/3/2021
ఏపీలో దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం ఇంకా కొనసాగుతోంది. రామ తీర్థం గొడవ ఇంకా సద్దుమణగక ముందే బెజవాడలో సీతారామమందిరంలో సీతమ్మ తల్లి విగ్రహ ధ్వంశం కావటం కలకలం రేపింది. టీడీపీ, బీజేపీ శ్రేణులతోపాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా ఆందోళనకు దిగటంతో బెజవాడలో ఉ్రదిక్తతంగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా పోలీసులు మోహరించి కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతోపాటు కేసు నమోదు చేయటంతో పార్టీ శ్రేణులు ఆందోళనను విరమించాయి. 

బెజవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న సీతారామ మందిరంలో ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంశమైంది. గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంశం చేసినట్టు గుర్తించిన ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయానికి సంబంధించిన గ్రిల్ తలుపు మూసేసి ఉన్నప్పటికీ కూడా విగ్రహాన్ని ముందుకు పడేటయంతో అది పగిలి పోయింది. ఉదయం బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆటో డ్రైవర్లు ఆరు గంటల సమయంలో వచ్చినపుడు కూడా విగ్రహాలు బానే ఉన్నాయి. అయితే ఆ తర్వాతే ఇది జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో పాటు బీజేపీ, టీడీపీ శ్రేణులు, హిందూ ధార్మిక సంఘాలు కూడా ఘటన జరిగిన ఆలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగాయి. ఈ సమయంలో ఎలుకల వల్లే విగ్రహం పడి పగిలి ఉంటుందని కృష్ణలంక సీఐ సత్యానందం చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. దీనితో పార్టీ నేతలు ఆలయం ఎదుటే ఆందోళనకు దిగాయి.

బీజేపీ నేతలతోపాటు టీడీపీ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ ఆందోళనలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విగ్రహాల ధ్వంశం అనేది డిజైన్డ్ ప్రోగ్రాంగా నిర్వహిస్తున్నారని అన్నారు. దీని వెనుక ఓ మాఫియా కూడా ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి, హత్యల నుంచి ప్రజల దృష్టి మరల్చటానికి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. నిందితులను పట్టుకోవాలని ప్రభుత్వం బాద్యత వహించాలన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. బీజేపీ శ్రేణులు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని, ఆయన మంత్రిగా ఉన్నప్పటికి ఏం పట్టించుకోవటంలేదన్నారు. ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, ఆలయాల్లో దేవతా మూర్తుల విగ్రహం ధ్వంసం అవుతున్నా కనీసం ప్రభుత్వం నుంచి ఎవరూ రావటం లేదని ఏమైందో అడగటంలేదన్నారు నేతలు. 

ఇక విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహ ధ్వంశం కేసు విచారణకు బెజవాడ సీపీ బత్తిని శ్రీనివాసులు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఘటనపై 448, 427, 295, 151 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు సీపీ బత్తిని. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించామని కొన్ని క్లూస్ దొరికాయన్నారు. బెజవాడలో ప్రార్ధనా మందిరాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని, అవసరంగా ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. బెజవాడలో 1400 ప్రార్ధనా మందిరాలు ఉన్నాయని, సీసీ టీవీ ల ఏర్పాటు కూడా 65 శాతం ఉందన్నారు. అనుమానాలు ఉన్న వారిపై సమాచారం ఇవ్వాలన్నారు. ఆలయాల ధ్వంశంపై నిందితులను పట్టుకుంటామన్నారు సీపీ.

More news

Related News

-Next--Last