కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి వారి ఆలయం గోపురం మీద ఉన్న విగ్రహాలను ద్వంసం

1/2/2021
ఏపీలో దేవాలయాలపై దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ దాడుల వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేదా మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనే విషయం తెలియదు కాని ఇటీవలే విజయనగరం రామతీర్థ ఆలయంలోని రాముడి విగ్రహంను ద్వంసం చేసిన విషయం తెల్సిందే. ఆ విగ్రహం వివాదం కొనసాగుతున్న ఈ సమయంలోనే ఏపీలో మరో దేవాలయంలో దేవుడి విగ్రహంపై దుండగులు దాడులు చేశారు. ఇది కర్నూలు జిల్లా కోసిగి మండలం మర్లబండలో జరిగింది.

గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయం గోపురం మీద ఉన్న విగ్రహాలను ద్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఆలయం ముఖ ద్వారం వద్ద ఉన్న విగ్రహాలను కూడా పాడు చేసేందుకు కొందరు యత్నించారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.

హిందూ సమాజంపై కొందరు కక్ష కట్టి ఇలాంటి దాడులు చేస్తున్నారని అనిపిస్తుంది అంటూ విపక్ష పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రభుత్వం చేష్టలుడిగా చూస్తూ ఉండి పోతుంది. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా మంత్రులు చెబుతున్నారు.

More news

Related News

-Next--Last