ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంతక్రియల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్

12/3/2020
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో ఇటీవలే మరణించారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నిర్వహించారు. అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. నోముల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. నోముల కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నోముల అంత్యక్రియలు పాలెం గ్రామంలోని ఆయన స్వంత వ్యవసాయక్షేత్రంలో నిర్వహించారు. ఈ ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో పాలెం గ్రామం చేరుకున్న సీఎం కేసీఆర్... నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు.

నోముల నర్సింహయ్య హైదరాబాదులో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు. గురువారం నాడు అంత్యక్రియలను నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నోముల నర్సింహయ్య భౌతిక కాయానికి నివాళుల‌ర్పించారు. 

Other news

More News

-Next--Last