రేపట్నుంచి హైదరాబాద్‌లో థియేటర్లు రీ-ఓపెన్.!

12/3/2020
కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత హైదరాబాద్ నగరంలోని మల్టీఫ్లెక్సులు, అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు డిసెంబర్ 4న రీ-ఓపెన్ కానున్నాయి. రేపటి నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ 50 శాతం సీటింగ్‌  కెపాసిటీతో పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్, సినీపోల్స్, మహేశ్ బాబు AMB సినిమాస్ తెరుచుకోనున్నాయి. ఇటీవల కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లు తెరుచుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆయా థియేటర్లు అందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశాయి.

ఇదిలా ఉంటే మొదటిగా అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5 వంటి ఓటీటీలలో రిలీజ్ అయిన సినిమాలను విడుదల చేయాలని తెలంగాణ ఎగ్జిబ్యూటర్లు ప్లాన్ చేశారు. అయితే అందుకు ఆయా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు అంగీకరించలేదు. దీనితో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి పాత సినిమాలు రీ-రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. వీటిని మరోసారి రిలీజ్ చేస్తే మరి ఆడియన్స్ థియేటర్లకు వస్తారా.? లేదా.? అన్నది క్వశ్చన్ మార్క్. అందుకే అందరూ కూడా హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘టెనెట్’  మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో ఆడియన్స్‌ థియేటర్‌ వరకు వచ్చే మూడ్‌లో ఉన్నారా.? లేదా.? అన్నది వేచి చూడాలి.

Other news

More News

-Next--Last