హెచ్-1బీ వీసాలపై అమెరికా కోర్టు సంచలన తీర్పు, లక్షలాది భారతీయులకు ఊరట, ట్రంప్ కు దెబ్బ

12/2/2020
లక్షలాది భారతీయులకు ఊరట ! హెచ్ 1 బీ వీసాలపై అత్యంత ప్రధాన నిర్ణయాన్ని అమెరికా కోర్టు ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ మరికొద్ది రోజుల్లో అధికారాన్ని వీడనుండగా కాలిఫోర్నియా కోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన రెండు వీసాల  రెగ్యులేషన్స్ ని కోర్టు రద్దు చేసింది. అమెరికాలోని ఐటీ సంస్థలు, ఇతర యజమానులు హెచ్ 1 బీ వీసాలకు అర్హతను తగ్గించిన ట్రంప్ పాలసీని డిస్ట్రిక్ట్ జడ్జి జెఫ్రీ వైట్ తన 23 పేజీల ఉత్తర్వుల్లో కొట్టివేశారు. ఫలితంగా ఈ నెల 7 నుంచి ఆయా వృత్తులు, ఇతర అంశాలపై హోం ల్యాండ్ సెక్యూరిటీ అమలు చేయదలిచిన విధానం ఇక చెల్లుబాటు కాదు. అలాగే డిసెంబరు 8 నుంచి వేతనాలకు సంబంధించిన లేబర్ రూల్ కూడా చెల్లబోదు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన కోవిడ్ మహమ్మారివల్ల ఈ దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కోట్లాది అమెరికన్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందని  న్యాయమూర్తి పేర్కొన్నారు. వివిధ రకాల ఆంక్షల వల్ల చిన్నా, పెద్దా వ్యాపారాలు దెబ్బ తిన్నాయని అన్నారు. హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ఆంక్షలు చట్ట విరుధ్ధమని, అవి ఎన్నో లోపాలతో  కూడినవని యూఎస్  ఛాంబర్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, సిలికాన్ వ్యాలీ కంపెనీలు, వివిధ యూనివర్సిటీలు, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ సంస్థలు కోర్టులో దావాలు వేశాయి. తమ సంస్థల్లో పని చేసే ఎంటర్ ప్రెన్యూర్స్ అంతా వీసాలపై మొదట ఇక్కడికి వచ్చిన వారేనని బే ఏరియా కౌన్సిల్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ కి తలుపులు మూసివేయడం సబబేనా అని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు తమకు పెద్ద ఊరట ఇఛ్చినట్టు ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఇమ్మిగ్రేషన్ పాలసీ) డైరెక్టర్ జాన్ వ్యాఖ్యానించారు. ఇది అమెరికన్లకు కూడా వరమన్నారు.

Other news

More News

-Next--Last