హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మొదటి మెట్రో రైల్ ఉదయం 6.30

12/2/2020
హైదరాబాద్‌లో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా నగరవాసులు ఎక్కువగా మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి మెట్రో రైలు ప్రయాణ సమయాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

వాస్తవానికి మొదటి మెట్రో రైలు ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. అయితే రేపట్నుంచి ఉదయం 6.30 – రాత్రి 9.30 వరకు మెట్రో రైలు సేవలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. అలాగే ఇప్పటిదాకా మూసి ఉన్న భరత్ నగర్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు రేపట్నుంచి తెరుచుకోనున్నాయని తెలిపారు.

Other news

More News

-Next--Last