జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్
12/2/2020
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 45.97 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఎక్కువ నమోదైనట్లు లోకేష్‌కుమార్ తెలిపారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈ సారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. అయితే మొదటి నుంచి ఎన్నికల పోలింగ్ మందకొడిగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 36.73 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఓటింగ్ ఎక్కువగా జరిగింది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, కరోనా భయం పోలింగ్‌పై పడింది. లేకుంటే ఇంకా ఎక్కువ శాతం పెరిగేదే. ఇక ఓల్డ్ మలక్ పేట మినహా 149 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం ఓల్డ్‌మలక్‌పేటలో రీపోలింగ్ జరగనుంది.