కాషాయ మాస్క్‌తో విజయశాంతి.. బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు

12/1/2020
రాములమ్మ బీజేపీలో చేరుతున్నారు. ఇందుకు ముహుర్తం కూడా ఫిక్సైంది. డిసెంబర్‌ 7న స్వయంగా ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడి సమక్షంలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారు .
దుబ్బాక ఉపఎన్నిక జరుగుతున్న సమయంలోనే విజయశాంతి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ కావడంతో ఆమె కమలదళంలోకి చేరుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. చివరకు ఆ అవే నిజమయ్యాయి.
కొద్ది రోజులుగా వియజశాంతి పలు ప్రెస్‌నోట్లు రిలీజ్ చేసి… బీజేపీని పొగడ్తలతో ముంచుతూ…కాంగ్రెస్ బలహీనపడుతోందని… సొంత పార్టీని ఇరకాటంలో పెడుతూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పలుమార్లు పంచ్‌లు కూడా పేల్చారు. రాములమ్మను సముదాయించేందుకు ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్ రంగంలోకి దిగారు. స్వయంగా ఆమెను కలిసి సమస్యలేంటో తెలుసుకున్నారు. అయినా రాములమ్మ శాంతించలేదని తెలుస్తోంది.

Other news

More News

-Next--Last