షేక్‌పేట్‌ డివిజన్‌లో భాజపా నేతపై దాడి

12/1/2020
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా వివిధ కారణాలతో ఇవాళ ఉదయం నుంచి పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. తాజాగా షేక్‌పేట డివిజన్‌ పరిధిలో ఎంఐఎం, భాజపా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో డివిజన్‌లో అలజడి వాతావరణం నెలకొంది. షేక్‌పేట డివిజన్‌లో ఎంఐఎం నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని భాజపా నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంఐఎంకు చెందిన పలువురు నాయకులు భాజపా నేతలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో భాజపా నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎంఐఎం నేతలు రిగ్గింగ్‌ చేస్తుండగా అడ్డుకున్నందుకే దాడి చేశారంటూ భాజపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Other news

More News

-Next--Last