GHMC Polls: మందకొడిగా పోలింగ్, భారీ ఓటింగ్‌తో చైతన్యం చాటాలంటూ ప్రముఖుల పిలుపు

12/1/2020
జీహెచ్ఎంసీ ఓటర్లు మారలేదు. ఎప్పటిలాగే ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 18.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడమే ఇందుకు ఉదాహరణ. పోలింగ్‌కు మరో ఐదు గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో నగరంలో ఓటింగ్ శాతం కనీసం 40 శాతమైనా దాటుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బస్తీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటు వేసేందుకు జనం ముందుకొస్తున్నా.. జూబ్లీ హిల్స్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటు వేయడానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ.. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా కనిపించింది. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

అయితే పది గంటల తరువాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వస్తారని రాజకీయ పార్టీలు, అధికారులు భావించారు. కానీ గ్రేటర్ ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదనే విషయం ఓటింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతోంది. జూబ్లీ హిల్స్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం సిబ్బంది వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఎంతగా కోరినా.. ఓటర్లు మాత్రం వారిన విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే నగరంలో బస్తీలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో మాత్రం జనం ఓటు వేసేందుకు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు శివారు ప్రాంతాల్లోనూ ఓటింగ్ పర్వాలేదనిపించేలా ఉందని తెలుస్తోంది.

Other news

More News

-Next--Last