నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో బయటపడిన ప్రాచీన శాసనాలు... యుగాంతం ప్రస్తావన ఉందా?

11/30/2020
12
తెలంగాణ... నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో కొన్ని ప్రాచీన శిలా శాసనాలు బయటపడ్డాయి.ఇవి వెయ్యేళ్ల కిందటి శాసనాలని అంచనా వేస్తున్నారు.గ్రామ పంచాయతీ దగ్గరున్న శాసనం కల్యాణి చాళుక్యుల కాలం నాటిదని భావిస్తున్నారు.గ్రామంలోని పురాతన బావి దగ్గరున్న మరో రాతి పైనా కన్నడ లిపి ఉన్నట్లు గుర్తించారు.స్థానిక ఆలయాల దగ్గరున్న రాతి కట్టడాలపై భిన్నమైన రాతలున్నాయని తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళిన నిర్మల్‌కు చెందిన చరిత్ర పరిశోధకుడు, కవి తుమ్మల దేవ్ రావు వాటిని పరిశీలించి రాష్ట్ర పురావస్తు శాఖలో పనిచేస్తున్న తన మిత్రుడికి పంపించారు.వారు వాటిని వెయ్యేళ్ల కాలం నాటి కన్నడ శాసనాలుగా ధృవీకరించారు.

Other news

More News

-Next--Last