భద్రాద్రి రాములోరి చెంతకు గుడ్లగూబ... దేనికి సంకేతం

11/30/2020
123
సాధారణంగా గుడ్లగూబలు మనుషుల దగ్గరకు రావు. అసలు మనుషులు తిరిగే ప్రాంతాల్లో అవి ఉండవు. ఎక్కడో అడవుల్లో ఏ చెట్టు మీదో కదల కుండా ఉంటూ పెద్ద కళ్లతో చూస్తుంటాయి. అలాంటిది ఓ గుడ్ల గూబ భద్రాచలం సీతారామ స్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చింది.భద్రాచలం రామాలయం పూర్వ యాగ శాల దగ్గర ఈ పెద్ద పక్షి కనిపించింది. రామదాసు కీర్తనలు వింటూ... శ్రీరామచంద్రస్వామిని శరణు కోరుతున్నట్లు అది కనిపించింది.ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ వింత ఆకారంతో ఉండటంతో భక్తులు దాన్ని చూసి సెల్ఫీలు తీసుకున్నారు.భక్తులు దాన్ని ముట్టుకున్నా... అది పారిపోవట్లేదు. చూడ్డానికి బాగా నీరసంగా కనిపిస్తోంది.కొంత మంది దాన్ని చూసి... గుడ్లగూబ మంచిది కాదు... చెడుకు సంకేతం... అది ఇక్కడకు వచ్చిందంటే... త్వరలో ఏదో ఆపద రాబోతున్నట్లే అన్నారు.పెద్ద పెద్ద కళ్లతో, వంకర ముక్కుతో భయంకరంగా ఉండే గుడ్లగూబ ఆకారం చూస్తే చాలా మంది భయపడటం సహజం. అది ఇంట్లోకి వచ్చినా, ఇంటిపై వాలినా, ఎదురు వచ్చినా, పరిసరాలలో తిరిగినా అశుభ సూచకమని చాలా మంది నమ్ముతారు. గుడ్ల గూబ అరిస్తే... ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు చనిపోతారనే నమ్మకం కూడా ఉంది కొన్ని పల్లెల్లో.నిజానికి గుడ్ల గూబ ఆకారం అలా ఉంటుందే తప్ప... అది చెడు పక్షి కాదు. లక్ష్మీదేవి వాహనం గుడ్ల గూబ. మిగతా దేవుళ్లందరికీ వేర్వేరు వాహనాలు ఉండటంతో... అమ్మవారు... తనకంటూ ఓ వాహనం ఉండాలని... గుడ్లగూబను వాహనంగా చేసుకున్నారు.

శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపిస్తే శుభ సూచకం. లక్ష్మీదేవి... స్వామి వారితో కలిసి ప్రయాణించినప్పుడు గరుత్మంతుడిని, ఒంటరిగా ప్రయాణించినప్పుడు గుడ్లగూబను అధిరోహిస్తుంది. ఉల్లూక తంత్రంలో గుడ్లగూబ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. రాత్రి వేళ గుడ్లగూబ ఎవరింటిపైనైనా వాలితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట.పనిమీద బయటకు వెళ్లేటప్పుడు గుడ్లగూబ ఎడమవైపు కనిపిస్తే కార్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గుడ్లగూబ ఉంటే, అక్కడి స్థానికులకు సిరిసంపదలు వస్తాయట.ఈ పక్షికి ఉదయం వేళ సరిగ్గా కనపడదు. అందుకే రాత్రి వేళ ఎగురుతుంది. అందుకే అమావాస్య రోజు లక్ష్మీ దేవికి పూజలు చేస్తుంటారు.అందువల్ల రాములోరి చెంతకు గుడ్ల గూబ వచ్చిందంటే... అది శుభ సూచికం అంటున్నారు భక్తులు.

Other news

More News

-Next--Last