ముస్లింలకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదు : కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప

11/30/2020
 టికెట్ ఎవరికైనా ఇస్తాం..హిందూవులలో ఏ వర్గమైనా ఫరవాలేదు. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ ముస్లింలకు మాత్రం కచ్చితంగా టికెట్ ఇవ్వం. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు..

కర్నాటకలో ఇటీవలి కాలంలో పరిణామాలు మారుతున్నాయి. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పుడు బెళగావి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా మరోసారి వాతావరణం హాట్ గా మారింది. దీనికి కారణం కర్నాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు. 

బెళగావి లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కోవిడ్ వైరస్ కారణంగా మరణించారు. దాంతో ఈ స్థానం ఖాళీ అయింది. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్ని పురస్కరించుకుని కర్నాటక మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. బెళగవి లోక్ సభ  టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం అభ్యర్ధికి ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పడం దీనికి కారణం. 

Other news

More News

-Next--Last