హైదరాబాద్‌లో మగ వ్యభిచారుల గుట్టు బయటపడింది. మగ వ్యభిచారులు కావాలా అంటూ ఆన్ లైన్ డేటింగ్ వెబ్సైట్లే వేదికగా కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇందులో ప్రకటనలు చూసి ఎవరైనా మహిళలు స్పందిస్తే చాలు వారితోతో నైస్‌గా మాట్లాడి డబ్బులు కొట్టేస్తున్నారు. అంతేకాదు మేల్ ఎస్కార్ట్ ( మగ వ్యభిచారి) గా మారి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా... అని ఆన్ లైన్ ప్రకటన చూసి ఇటీవల ఓ యువకుడు వారితో వారితో కాంటాక్ట్ అయ్యాడు. అంతేకాదు నెలకు 3 లక్షలు ఇస్తామని నమ్మించారు. కాగా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్, అలాగే మెంబర్ షిప్ ఫీజు కింద రూ.2 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ యువకుడు డబ్బు చెల్లించగా, అప్పటి నుంచి ఆ వెబ్ సైట్ నిర్వాహకులు ఇక కాంటాక్ట్ కాలేదు. దీంతో ఆ యువకుడు లబోదిబో మన్నాడు.
అంతేకాదు ఇటీవల మరో కుర్రాడు కూడా రూ. 1.5 లక్షలు చెల్లించాడు. అయితే అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అలాగే నగర శివారులోని ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా రూ.1.75 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఓ ముఠాను కనుగొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి పట్టణం కేంద్రంగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అక్కడే మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచి సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వీరు కొన్ని వెబ్సైట్లను క్రియేట్ చేసుకుని, యువకులకు మగ వేశ్యలుగా మార్చి డబ్బులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. అంతేకాదు వీరంతా ఆఫీసులు ఓపెన్ చేసి మరీ మోసాలు చేస్తున్నారు. వీరి వద్ద మొత్తం పది మంది మహిళా టెలీకాలర్స్ సైతం ఉండటం విశేషం. అంతేకాదు వీరిపై దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదు కావడం విశేషం.