గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నుంచి రావడం తప్పా? కేసీఆర్ గల్లీలను మరిచారు కాబట్టే భయపడుతున్నారు.. అమిత్ షా సెటైర్లు

11/29/2020

 
ఎంఐఎం అండతోనే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు: అమిత్ షా

ఎంఐఎం అండతోనే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందని అమిత్ షా ఆరోపించారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని చెప్పారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అని అమిత్ షా అడిగారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావాలని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.


కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ లో చేరకుండా పేదలకు అన్యాయం చేశారు : అమిత్ షా

అంతపెద్దఎత్తున హైదరాబాద్ కు వరదలొస్తే, నగరంలో ముఖ్యమంత్రి పర్యటించలేదు.. వరదలప్పుడు సీఎం ఎవ్వరితోనూ సమావేశం కాలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ లో చేరి ఉంటే, పేదప్రజలకు ఐదు లక్షల ఖర్చుతో వైద్యం చేయించుకునే సౌలభ్యం కలిగి ఉండేదని అమిత్ షా చెప్పారు.

ఒక్కసారి గ్రేటర్ లో బీజేపీకి అధికారమిచ్చారంటే…

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో కొత్త నల్లా కనెక్షన్లు 20 శాతం కూడా ఇవ్వలేదని అమిత్ షా విమర్శించారు. కేంద్రం కల్పించిన ఆయుష్మాన్ భారత్ లో చేరిఉంటే, పేదలకు మెరుగైన వైద్యం అందేదని ఆయన చెప్పారు. కేసీఆర్ సర్కారు ఆ పనిచేయలేదని విమర్శించారు. ఒక్కసారి బీజేపీకి గ్రేటర్ లో అధికారమిస్తే హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

Other news

More News

-Next--Last