TRS కార్పొరేటర్,‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి (Thokala Srinivas Reddy) భాజపాలోకి

11/19/2020
గ్రేటర్‌ ఎన్నికల సమరం షురూ అయిన వేళ స్థానికంగా బలమైన నేతలకు ఆయా పార్టీలు గాలమేస్తున్నాయి. అధికార తెరాసతో పాటు భాజపా, కాంగ్రెస్‌లో బలంగా ఉన్న నేతలను తమవైపు ఆకర్షించుకోవడానికి ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు రచిస్తు్న్నాయి. దీనిలో భాగంగా పలువురికి పార్టీ టికెట్లు ఇస్తామనే హామీతో తమవైపు రప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మైలార్‌దేవ్‌పల్లికి చెందిన తెరాస కార్పొరేటర్‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి (Thokala Srinivas Reddy ) భాజపాలో చేరగా.. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో కార్పొరేటర్‌ కాషాయ కండువా కప్పుకొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తెరాసకు చెందిన వెంగళరావునగర్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ భాజపాలో చేరారు. దీంతో వెంగళరావునగర్‌ భాజపా అభ్యర్థిగా మనోహర్‌కే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

Other news

More News

-Next--Last