మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం

10/17/2020
తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. న్యూమోనియా కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా గత నెలలో నాయిని కరోనా బారిన పడగా.. దాని నుంచి కోలుకున్నారు. ఆ తరువాత ఆయనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు పరీక్షలు చేశారు. అందులో న్యూమోనియా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కాగా మరోవైపు నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకి కోలుకుంది. అయితే మెరుగైన చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో అహల్య ఉన్నారు.

Recent news

More News