పంది పిల్లల్లో కొత్త కరోనా, మనుషులకూ వచ్చే అవకాశం

10/15/2020
కరోనా కారణంగా గత పది నెలలుగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఇండియా వంటి అభివృద్ది చెందుతున్న దేశం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా కరోనా కారణంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో మరో కరోనా వైరస్‌ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్శిటీ అధ్యయనంలో పంది పిల్లల్లో తీవ్ర విరేచనాలు కలిగించే వైరస్‌ ను కనిపెట్టారు. దానికి కరోనా వైరస్‌ గా గుర్తించారు. పంది పిల్లల నుండి మానవాలికి ఆ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని 2016లో చైనాలో మొదటిసారి కనిపెట్టారు. గబ్బిలాల నుండి పందులకు ఈ వైరస్‌ సోనికట్లుగా గుర్తించారు. ఆ వైరస్‌ మనుషులకు వస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. పందుల పెంపకం అధికంగా ఉండే దేశాల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్‌ పట్ల అప్రమత్తతతో ఉండాలంటూ కూడా వారు హెచ్చరించారు.

More News