చిత్తూరు జిల్లా తిరుపతిలో 20 ఏళ్ల యువతిపై పాస్టర్‌ అఘాయిత్యం

10/15/2020
ఈమద్య కాలంలో ఏపీలో పలువురు పాస్టర్‌ లు లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతిలో పాస్టర్‌గా చేస్తున్న దేవసహాయంపై 20 ఏళ్ల యువతి లైంగిక వేదింపుల కేసు పెట్టింది. మొదట అతడిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఒప్పుకోలేదు అంటూ బాధిత మహిళ మీడియాతో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఏఎస్పీ వద్దకు బాధితురాలు వెళ్లింది. దాంతో దేవ సహాయం పై కేసు నమోదు చేయడంతో పాటు బాధిత యువతి ని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి కథనం ప్రకారం.. బాధితురాలు గత నెల 4వ తారీకున పాస్టర్‌ దేవసహాయం నిర్వహిస్తున్న రెయిన్‌ బో క్లినిక్‌ ప్రాడెక్ట్‌ కంపెనీలో జాయిన్‌ అయ్యింది. వారి ప్రాడెక్ట్స్‌ ను డోర్‌ డెలవరీ చేస్తూ ఉంటారు. ఈనెల 3వ తారీకున బాధితురాలిని పాస్టర్‌ ప్రాడెక్ట్స్‌ డెలవరీ ఇచ్చేందుకు గాను రమ్మంటూ కారు ఎక్కించుకుని తీసుకు వెళ్లడాట. రేణిగుంట వైపు వెళ్లి అక్కడ నిర్మాణుష ప్రాంతంలో కారు ఆపి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని దిశ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు ఇవ్వగా ఆయన పెద్ద వాడు నీవు ఆయనతో పోరాటం చేయలేవు అంటూ వేరే ఉద్యోగం చూసుకోమన్నారట. దాంతో ఏఎస్పీ వద్దకు వెళ్లిన బాధితురాలి కేసును నమోదు చేయడం జరిగింది. ఎంక్వౌరీ చేస్తున్న పోలీసులు దేవ సహాయంను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Recent news

More News