వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

10/14/2020
దేశంలో వ‌రుస‌గా రెండోరోజు బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బుధ‌వారం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధ‌ర రూ.631 త‌గ్గి రూ.51,367 పలికింది. అటు అమెరిక‌న్ డాల‌ర్‌తో పోల్చితే రూపాయి మార‌కం విలువ స్వ‌ల్పంగా బ‌ల‌ప‌డ‌ట‌మే ఈ రోజు బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధ‌ర రూ.51,998 వ‌ద్ద ట్రేడ్ అయ్యింది. గత వారం రోజులుగా హెచ్చ తగ్గులు చోటుచేసుకుంటున్న బంగారం ధర రెండో రోజు దిగివచ్చింది. మరోవైపు, వెండి ధ‌ర‌లు కూడా బుధ‌వారం స్వల్పంగా త‌గ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.1,681 త‌గ్గి రూ.62,158కి దిగివచ్చింది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.63,839 పలికింది. ఇక‌, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1896 అమెరిక‌న్ డాల‌ర్లు పలుకగా, ఔన్స్ వెండి ధ‌ర 24.16 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది. కాగా, ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్ డాల‌ర్‌తో పోల్చితే రూపాయి విలువ నాలుగు పైస‌లు బ‌ల‌ప‌డి రూ.73.31 వ‌ద్ద ముగిసింది.

Recent news

More News