కేటీఆర్, మల్లారెడ్డికీ దేవాలయ భూములు.. సీబీఐ విచారణ చేయాలి: రేవంత్ రెడ్డి

5/3/2021
దేవుడి మాన్యాల్లో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డికి కూడా భూములున్నాయని.. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ పరిసరాల్లోని దేవరయాంజిల్ రామాలయ భూముల్లో కేటీఆర్ కు భూములున్నట్టు సేల్ డీడ్ ను మీడియాకు వెల్లడించారు. ఆన్ లైన్లో ఈ భూములు కనిపించడం లేదని.. ధరణి యాప్ ను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు.

దేవరయాంజిల్ లో సర్వే నెంబర్ 658 భూమిని మల్లారెడ్డి ఆక్రమించుకుని ఏడెకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. అక్కడే 1553 ఎకరాల్లో కేటీఆర్, నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దామోదర్ రావుకి భూమి ఉందన్నారు. సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్ కు కూడా వాటా ఉందని ఆరోపించారు. కేటీఆర్ కు భూమి అమ్మింది ఎవరో.. ఆన్‌లైన్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన దేవాలయ భూములు ఎందుకు మాయం అవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

More news

Related News

-Next--Last