సబ్బం హరి: అనకాపల్లి మాజీ ఎంపీ మృతి

5/3/2021
మాజీ ఎంపీ సబ్బం హరి(69) మృతిచెందారు. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు(03.05.2021) మధ్యాహ్నం మరణించారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడడంతో చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.

విశాఖ మేయర్‌గా, అనకాపల్లి ఎంపీగా పనిచేసిన ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.సబ్బం హరి రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. వివిధ న్యూస్ ఛానల్స్‌లో జరిగే రాజకీయ అంశాల డిబేట్లలో తరచూ పాల్గొనేవారు.మంచి మాటకారిగా పేరున్న సబ్బం హరి విశాఖ నగర పాలక సంస్థకు మేయరుగా, అనకాపల్లి ఎంపీగా పని చేశారు.

More news

Related News

-Next--Last