ప్రధాన్ మంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజన పథకం కింద మే, జూన్‌ నెలల్లో ఉచిత రేషన్ సరుకులు..!

5/3/2021
PM Garib Kalyan Yojana : దేశంలో తీవ్రతరం అవుతున్న కరోనా సంక్షోభం దృష్ట్యా మే, జూన్ నెలల్లో పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన్ మంత్రి గరీబ్‌ కల్యాణ్ యోజన పథకం కింద 5 కిలోల ఆహార ధాన్యాలు పేదలకు ఉచితంగా లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది దేశంలోని పేదలకు ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. మీకు రేషన్ కార్డు ఉంటే.. రేషన్ డీలర్లు మీ కోటా చెల్లించడానికి నిరాకరిస్తే మీరు టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) ప్రతి రాష్ట్రానికి ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను కలిగి ఉంది. మీరు మీ ఫిర్యాదును ఫోన్ చేసి తెలుపవచ్చు. అలాగే మీకు కావాలంటే మీరు మెయిల్ కూడా చేయవచ్చు. NFSA వెబ్‌సైట్ https://nfsa.gov.in కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. రేషన్ పంపిణీ వ్యవస్థ నుంచి అవాంతరాలను తొలగించడానికి, అందరికీ రేషన్ అందించడానికి ఫిర్యాదులు దాఖలు చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రేషన్ కార్డ్ హోల్డర్ తన ఫుడ్ కోటాను అందుకోకపోతే అతను ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

రేషన్ కార్డుదారులకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రయోజనాలు లభిస్తాయి. మీ రేషన్ కార్డులో నలుగురి పేర్లు నమోదు చేయబడిందంటే ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున మొత్తం 20 కిలోల ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ ధాన్యం ప్రతి నెల అందుకున్న రేషన్‌కు భిన్నంగా ఉంటుంది. అంటే ప్రతి నెలా రేషన్ కార్డులో ఐదు కిలోల ధాన్యం వస్తే మే, జూన్ నెలల్లో మీకు ఐదు కిలోల అదనపు ధాన్యాలు లభిస్తాయి. ఈ ఆహార ధాన్యాలు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపులోనైనా లభిస్తాయి. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

More news

Related News

-Next--Last