బెంగాల్ లో అప్పుడే హింస, బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ వర్గీయుల దాడులు, నివేదిక కోరిన కేంద్రం

5/3/2021
బెంగాల్ లో అప్పుడే హింస మొదలైంది. నిన్న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు ప్రారంభమయ్యాయని,  తమ పార్టీ కార్యకర్తలు ఆరుగురు హతులయ్యారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. కర్రలు, రాడ్లతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తల ఇళ్లలో ప్రవేశించి దాడులకు పాల్పడ్డారని వారు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై వెంటనే రిపోర్టు సమర్పించాలనికేంద్ర  హోమ్ శాఖ బెంగాల్ డీజీపీని ఆదేశించింది. అటు రాష్ట్ర గవర్నర్ జగ దీప్ ధన్ కర్ ..డీజీపీని పిలిపించి నివేదిక సమర్పించాలని కోరారు.హుగ్ల్లీ జిల్లాలో తమ పార్టీ కార్యాలయానికి తృణమూల్ కాంగ్రెస్ కార్యాలకర్తలు నిప్పు పెట్టారని బీజేపీ ఆరోపించింది. పైగా తమ పార్టీ నేత సువెందు అధికారి కారుపై దాడికి యత్నించారని, రాళ్లు విసిరారని, హల్దియా లో భయానక వాతావరణం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలతో తమకు సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి.ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన సుజాతా మొండల్ ఓడిపోవడంతో ఆ పార్టీవారు ఆగ్రహంతో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More news

Related News

-Next--Last