పబ్లిక్ టాయిలెట్ల ద్వారా కరోనా వైరస్

4/23/2021
కంటికి కనిపించని కరోనా మహమ్మారి వైరస్ ఎటు నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  నిత్యం మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  బయటకు వెళ్ళాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.  అయితే, అమెరికాకు చెందిన అట్లాంటిక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేశారు.  ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.  పబ్లిక్ టాయిలెట్లను వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని లేదంటే పబ్లిక్ టాయిలెట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.  టాయిలెట్ లో మాట్లాడిన, తుమ్మినా, దగ్గినా, చీదినా సూక్ష్మ పరిమాణంలో గాలి తుంపర్లు బయటకు వస్తాయి.  ఇక పబ్లిక్ టాయిలెట్లలో ఫ్లష్ చేసినపుడు సూక్ష్మపరిమాణంలో గాలి తుంపర్లు గదిమొత్తం వ్యాపిస్తాయి.  మలమూత్రాల ద్వారా మరోనా వైరస్ తో పాటుగా ఇతర వైరస్ లు కూడా ఈ గాలి తుంపర్ల ద్వారా గాలిలోకి ఐదు అడుగుల ఎత్తు వరకు 20 సెకన్లపాటు ఉండే అవకాశం ఉంటుంది.  ఆ సమయంలో ఎవరైన మాస్క్ పెట్టుకోకుండా టాయిలెట్ లోకి ప్రవేశిస్తే వారికీ వైరస్ సోకె ప్రమాదం ఉన్నది.  ఫ్లష్ చేసే సమయంలో టాయిలెట్ పై మూతను మూసేసి ఫ్లష్ చేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  అదే విధంగా టాయిలెట్ లోకి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని సూచిస్తున్నారు.

More news

Related News

-Next--Last