తెలంగాణ‌లోని ఈ మండ‌లంలో రేప‌టి నుంచి లాక్‌డౌన్‌

4/18/2021
తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ వేవ్ కేసులు భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి.. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున చేస్తుండ‌డంతో.. పాజిటివ్ కేసులు కూడా ఎక్కువ‌గానే వెలుగు చూస్తున్నాయి.. అయితే, కేసుల తీవ్ర‌తను బ‌ట్టి కొన్ని ప్రాంతాలు స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాయి.. ఇక‌, నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోనూ క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది.. దీంతో.. పలు గ్రామాల్లో రేపటి నుండి వారం రోజుల పాటు స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాల‌ని నిర్ణ‌యించారు.. ముథోల్ మండ‌లంలోని ఎడ్బిడ్, వెంకటాపూర్, చించాల, విట్టోలి తండా గ్రామాలలో స్వచ్చంద లాక్‌డౌన్ కోసం నిర్ణ‌యం తీసుకున్నారు.. అయితే, నిత్యావసర సరుకుల కోసం మాత్రం ఉదయం 6 నుండి 9 వరకు సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు స‌డ‌లింపులు ఇవ్వ‌నున్నారు. 
 

More news

Related News

-Next--Last