రేపటి నుంచి.. పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్..! ఆదేశాలు జారీ..

4/16/2021
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి మరోసారి పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మారిపోతోంది. ఈమేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 17(శనివారం) నుంచి  గాంధీ ఆస్పత్రిలో ఓపీ, ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయాలని పూర్తిస్థాయి కోవిడ్ చికిత్స అందించాలని ఆదేశించింది. ఇప్పటికే ఆస్పత్రిలో 450 మందికిపైగా కరోనా పేషెంట్స్‌ ఉన్నారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 150 మంది కోవిడ్‌ పేషెంట్లు జాయినయ్యారు.

మరోపక్క గాంధీకి వచ్చే కోవిడ్ రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతి పది నిమిషాలకు ఒకరు కరోనాతో గాంధీలో చేరుతున్నారు. ప్రస్తుతం కరోనా బాధితులతో ఐపీ బ్లాక్‌ మొత్తం నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈక్రమంలో ఆసుపత్రిలోని నాన్‌ కోవిడ్‌ డిపార్ట్‌మెంట్స్‌ను వైద్యులు, సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు.

More news

Related News

-Next--Last