వాటా ఇవ్వాలంటూ మంత్రి మల్లారెడ్డి వసూళ్ల దందా..! ఆడియో వైరల్..

4/6/2021
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఆడియో టేప్ వైరల్ అయింది. వసూళ్ల దందాకు పాల్పడుతూ ఓ రియల్టర్ ను బెదిరిస్తూ మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. ఓ వెంచర్‌ విషయంలో రియల్టర్‌కు మల్లారెడ్డి వార్నింగ్‌ ఇస్తున్నారు. ‘‘వెంచర్‌ వేసుకున్నావ్‌.. నాకు మామూలు ఎందుకు ఇవ్వలేదు’’ అని ఆయన అంటే.. సర్పంచికి ఇచ్చాను సర్.. అని రియల్టర్ చెప్పాడు. ‘సర్పంచ్‌కు ఇస్తే సరిపోతుందా.. డబ్బులిచ్చే వరకు వెంచర్‌లో పనులు ఆపాలి’ అని మల్లారెడ్డి హుకుం జారీ చేయడం ఆ ఆడియోలో ఉంది.

గతంలో కూడా మల్లారెడ్డిపై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలను బెదిరించిన ఆడియోలు, శ్యామల అనే మహిళకు చెందిన భూమిని ఆక్రమించడం, రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఆ మాటలు నావి కావని మంత్రి సమాధానం ఇస్తున్నారు. యాభై ఎకరాల్లో ఓ రియల్టర్ వెంచర్ వేసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగానే మల్లారెడ్డి ఈ బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది.

More news

Related News

-Next--Last