Telangana Schools: స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక కామెంట్స్

8/29/2021
సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు టీవీ9తో చెప్పారు. 18 నెలలుగా స్కూళ్లు మూతపడటంతో పిల్లలకు సైకలాజికల్ గా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష తరగతులతో పోలిస్తే ఆన్ లైన్ క్లాసులు అంత ఎఫెక్టివ్ గా ఉండవన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో చిన్నచిన్న సమస్యలు ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్న సబితా ఇంద్రారెడ్డి… గ్రామ సర్పంచుల సహకారంతో వాటిని అధిగమించాలంటూ హెడ్మాస్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను సిద్ధంచేయడం, వసతుల కల్పించడంలో లోకల్ బాడీస్ తప్పనిసరిగా ఇన్వాల్స్ కావాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఈనెల 30లోపు స్కూళ్లలో క్లీనింగ్ పనులు పూర్తి కాకపోతే హెడ్మాస్టర్లనే బాధ్యులుగా చేస్తామంటూ హెచ్చరించారు. 31లోగా స్కూళ్లను సిద్ధంచేసి రిపోర్ట్ ఇవ్వాలని హెడ్మాస్టర్లను ఆదేశించినట్లు మంత్రి సబిత తెలిపారు. 

More news

Related News