Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ సరయు..!

Sarayu eliminated Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలై వారం రోజులు ముగిసింది. కంటెస్టెంట్స్.. హౌస్‌లో రెచ్చిపోయి కావాల్సినంత వినోదం పంచుతున్నారు. గత సీజన్స్‌లానే ఇంటిసభ్యుల మధ్య గొడవలు, అరుపులు, గోలలు. ఏడుపులు, నవ్వులు ఇలా సందడిగా బిగ్ బాస్ తెలుగు ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్‌లో ఉన్నవారంతా ఎక్కువ రోజులు ఉండాలని విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే మొదటి వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని.. ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠకు తెరదించారు నాగార్జున. అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్‌లో ఈవారం జెస్సీ, 7 ఆర్ట్స్‌ సరయు మధ్య ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగగా.. సరయు ఎలిమినేషన్‌ అయింది. బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో.. అని అందరూ ఈ రోజు షో వరకు ఎదురు చూశారు. అయితే మొదటి వారంలోనే సరయు ఎలిమినేట్‌ కాక తప్పలేదు.

అయితే.. మొదటి వారం నామినేషన్స్‌లో ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు శనివారం నాటి ఎపిసోడ్‌లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది మానస్, సరయు, కాజల్, జెస్సీ ఉండగా.. ఈ నలుగురిలో సరయు బయటకు వచ్చారు. ప్రేక్షకుల ఓటింగ్‌లో మానస్‌, కాజల్‌ సేవ్‌ అయ్యారు. సరయు జేసీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. అయితే.. ఈ ఎలిమినేషన్‌లో మొదట జెస్సీ బయటకు వెళతాడనుకున్నారు. కానీ సరయు అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయింది.

7 Arts సరయూ.. యూట్యూబ్‌లో అడల్ట్‌ కామెడీతో వీడియోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తోటి కంటెస్టెంట్లనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌నే దమ్‌దమ్‌ చేస్తానంటూ ఐదో సీజన్‌లో అడుగు పెట్టింది. షో ప్రారంభం రోజే నాగ్‌ ఎదుట తన మాటలతో తనేంటో చూపించకనే చూపించింది. స్టేజీ మీదే ఆ రేంజ్‌లో చెలరేగిపోయిన సరయు.. హౌస్‌లో ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎలిమినేట్ అయింది.

Other news