TikTok Fun Bucket Bhargav : అమ్మాయిలంటే పిచ్చి, వాడో పెద్ద ఉమనైజర్.. ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన స్నేహితులు

TikTok Fun Bucket Bhargav : ఫేమస్ అవ్వాలని అనుకునే వారే వాడి లక్ష్యం. వారికి ఈజీగా వల వేస్తాడు. సోషల్ మీడియాను దున్నేయాలని కలలు కనే వారే వాడి టార్గెట్. మాటలతో మాయ చేస్తాడు. అంతలోనే వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇంకా కాదంటే సెంటిమెంట్ డైలాగులతో చేతులు కోసుకుంటూ ఎదుటి వాళ్లకు చల్లగా ఆయింట్ మెంట్ పూస్తాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు అన్నట్లు.. కెమెరా ఆన్ అయితే ఒకలా, కెమెరా ఆఫ్ అయితే మరోలా ఉంటూ.. అందరికి మరో స్వాతిముత్యంలా కనిపిస్తాడు. వాడే టిక్ టాక్ ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్. ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈనాటి పవర్ స్టార్ వరకు అంతా తనకన్నా తక్కువే అన్నట్టు తెగ బిల్డప్ ఇస్తాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. ఫన్ బకెట్ భార్గవ్ కేసులో రోజుకో వ్యవహారం వెలుగులోకి వస్తోంది.

వాడో పెద్ద ఉమనైజర్:
భార్గవ్ పేరు చెబితే చాలు అతడి చేసిన పాపాలను ఏకరువు పెడుతున్నారు అతడి స్నేహితులు. నిన్నటి వరకు కలిసి వీడియోలు చేసిన వీరంతా భార్గవ్ మామూలోడు కాదంటూ దండం పెడుతున్నారు. అతనో పెద్ద ఉమనైజర్ అని, అమ్మాయిల విషయంలో అతడు అనుకున్నది వర్కవుట్ కాకపోతే బ్లాక్ మెయిల్ చేస్తాడని వాపోతున్నారు. అతడి ప్రవర్తన సరిగా లేకనే అతడికి దూరం అయినట్టు భార్గవ్ స్నేహితురాలు సయ్యద్ సుమయ ఫరాహత్. తాను చేసిందే కరెక్ట్ అని ఫీల్ అవుతాడని, అతడి యాట్యిటూడ్ నచ్చకే టీమ్ లోంచి బయటకు వచ్చానని చెబుతోంది. భార్గవ్ జెంటిల్ మెన్ అనుకున్నా, కానీ…పెద్ద ఉమనైజర్ అని తెలిసిందని చెప్పింది.

కెమెరా వెనకాల నాతో కూడా చాలాసార్లు:
ఇప్పటికే భార్గవ్ తో కలిసి వీడియోస్ చేసిన ఓమైగాడ్ నిత్య, అమ్మాయి అబ్బాయి ఫేం మౌనిక ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాజాగా సుమయ అనే మరో అమ్మాయి ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి భార్గవ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. కెమెరా ముందు ఒకలా కనిపించే భార్గవ్.. తెరవెనుక మరోలా ప్రవర్తిస్తాడంటూ సుమయ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అతనితో పనిచేసిన అమ్మాయిల కారణంగానే భార్గవ్ కు పేరు వచ్చిందని.. కానీ ఆ విషయాన్ని అతను అంగీకరించడని .. అతనో ఉమెనైజర్‌ అంటూ షాకింగ్ విషయాలను చెప్పింది.

స్టార్టింగ్‌లో భార్గవ్‌తో పని చేస్తుంటే మంచి వాడని అనుకున్నా.. ఆ తర్వాత మెల్లగా అతని గురించి తెలిసి టీమ్ వదిలివెళ్లా అని చెప్పింది సుమయ. తాను చేసేదే కరెక్ట్ అని భార్గవ్ ఫీల్ అయ్యేవాడని, అతను కెమెరా ముందు ఒకలా కెమెరా ఆఫ్ చేశాక మరోలా ఉంటాడని చెప్పుకొచ్చింది. తాను ఏది చేసినా ఏం కాదులే అనే తత్వం అతనిది తెలిపింది. నాకెందులో అతడి పద్దతి నచ్చలేదు, నేను సేఫ్ గా ఫీల్ అవ్వలేదు, అందుకే టీమ్ నుంచి బయటకు వచ్చేశాను అని చెప్పింది.

అన్నం తిన్నంత ఈజీగా అమ్మాయిల కోసం చేతులు కోసుకుంటాడు:
బ్లాక్ మెయిల్ చెయ్యడంలో మనోడికి ఎవరూ సాటిరారని భార్గవ్ ఫ్రెండ్స్ అంటున్నారు. తమ మధ్య గొడవలు లేకపోయినా రూమ్ వెకేట్ చెయ్యమన్నాడని వాపోయారు. అన్నం తిన్నంతా ఈజీగా భార్గవ్ అమ్మాయిల గురించి చేతులు కోసుకుంటాడని, ఇలా చాలాసార్లు చేశాడని చెప్పారు. వాడి గురించి తెలిసే వాడికి దూరంగా ఉన్నామన్నారు.

బాలికపై రేప్ కేసులో అరెస్ట్:
మైనర్ బాలిక(14)పై ఆత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఫన్ బకెట్ భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత మూడు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఫన్ బకెట్ భార్గవ్ వివాదమే నడుస్తోంది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై ఈ నెల 16న విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో దిశ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో వెలుగుచూసిన కొన్ని విషయాలు మరింత సంచలనం అవుతున్నాయి.

భార్గవ్ లాంటి వారితో బీకేర్ ఫుల్:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టిక్ టాక్ భార్గవ్ కేసుపై గాయని చిన్మయి తీవ్రంగా స్పందించింది. బాలికపై అత్యాచారం జరిగితే ఆమెపైనే ఆరోపణలు చేయడం దారుణం అన్నారు. భార్గవ్ లాంటి వ్యక్తులు చాలా స్మార్ట్ గా కన్నింగ్ గా ఉంటారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలంది. సోషల్ మీడియా ఎంతోమందిని పరిచయం చేసింది. ఇంకెందరికో పేరు తెచ్చింది. వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని ముందుకు సాగాలి. కానీ, భార్గవ్ మాత్రం పేరు, పరపతి మాటున అమ్మాయిలపై అకృత్యాలకు తెరలేపాడు. దీంతో నిన్నటి వరకు అభిమానించిన వారే అతడి గురించి నిజం తెలిశాక కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

News & Video Courtesy : 10TV 
నమ్మలేని నిజాల కొరకు ఈ వీడియోలు చూడండి
https://youtu.be/dZDCceHjLNc       
https://youtu.be/bEX2e7Bs6GoOther news