వెంకటేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. దృశ్యం 2లో కీలక పాత్రలో ఆ భామ

న‌టి సూజ వ‌రుణీ పాపులర్ రియాలిటీ షో త‌మిళ బిగ్‌బాస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ షోతో పాటు శ‌శికుమార్ కిడారి, ఇరవుక్కు ఆయిరమ్ కంగల్, అరుణ్ విజయ్ కుత్రమ్23 లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్రాల్లో ఆమె న‌ట‌న‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం మలయాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం దృశ్యంని విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే..జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ప్ర‌తిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది సూజ వ‌రుణీ.

న‌టి సూజ వ‌రుణీ మాట్లాడుతూ – “నేను దృశ్యం మొదటి భాగాన్ని అన్ని భాషలలో చూశాను. అలాగే రెండవ భాగం మలయాళంలో చూసి దర్శకుడు జీతు జోసెఫ్ అంత అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను ఎలా రాశాడా అని ఆశ్చర్యపోయాను. అలాంటి సినిమాలో నేను ఎందుకు భాగం కాలేక‌పోయాను అని బాధ‌ ప‌డ్డాను. కాని దృశ్యం 2 తెలుగు రీమేక్‌లో పాత్ర కోసం నన్ను ఎంచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అది కూడా ప్ర‌ఖ్యాత సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌ న‌న్నుసంప్ర‌దించిన‌ప్పుడు నా క‌ల నెర‌వేరినట్లు అనిపించింది. వెంకటేష్ సర్, మీనా మామ్, నదియా మామ్ మరియు తెలుగు పరిశ్రమలోని అనేక మంది సీనియర్ ఆర్టిస్టుల‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. నేను వారి నుండి చాలా నేర్చుకుంటాను. అలాగే, జీతు జోసెఫ్ సార్‌తో కలిసి పనిచేయడం ఒక గిఫ్ట్‌ . చాలా కూల్‌గా ఉంటూ నటీనటుల మంచి ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్టుకుంటారు. ఈ సినిమా నాకు ప్ర‌తిరోజు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. స‌రైన స‌మ‌యంలో ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు హ్యాపీగా ఉంది“ అన్నారు.

Other news