ఉప్పెన నిర్మాత ద్వార దర్శకుడు సుకుమార్ కు ఎంత ముట్టిందో తెలిస్తే షాక్ అవ్వుతారు

జీనియస్ దర్శకుడు సుకుమార్ తన శిష్యుడు బుచ్చి బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రెజంట్ చేసిన సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు.

ఉప్పెన ఫిబ్రవరి 12న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 50 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించబోతోంది. ఉప్పెన ద్వారా నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయింది. 20 కోట్లలో నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల షేర్ సాధించింది. అలాగే సాటిలైట్, డిజిటల్ రైట్స్ అదనం. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇలా మొత్తంగా చూసుకుంటే నిర్మాతలకు దాదాపు 50 కోట్ల లాభం మిగిలింది. అయితే ఇందులో 20 కోట్లు దర్శకుడు సుకుమార్ కు వెళ్ళిపోతుంది. ఈ సినిమాకు వెన్నుముకగా నిలిచి అంతా సజావుగా అయ్యేలా చూసినందుకు సుకుమార్ తీసుకుంటున్న ఫీజ్ అది.

Other news