Uppena Box Office Collections: Collection Day 5

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉప్పెన’. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని…’నీ కన్ను నీలి సముద్రం’ అనే పాట మొదటి నుండీ సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది. ఇక టీజర్, ట్రైలర్ లు అయితే ఆ అంచనాలను డబుల్ చేశాయనే చెప్పాలి.దాంతో ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి అనే చెప్పాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం 5వ రోజు అంటే మంగళవారం నాడు కూడా మంచి వసూళ్లను సాధించింది.

నైజాం                          10.60 cr
సీడెడ్                          5.15 cr
ఉత్తరాంధ్ర                          5.49 cr
ఈస్ట్                                  3.26 cr
వెస్ట్                                  1.90 cr
గుంటూరు                          2.05 cr
కృష్ణా                                  2.19 cr
నెల్లూరు                          1.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  31.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా                  1.79 cr
ఓవర్సీస్                          1.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్)          34.60 cr

”ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే ఆ టార్గెట్ ను పూర్తి చేసి .. 5 రోజులకు గాను ఏకంగా 34.60 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. మంగళవారం రోజున కూడా ఈ చిత్రం 3.12 కోట్ల పైనే షేర్ ను వసూల్ చెయ్యడం విశేషం.సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకే ఈ స్థాయిలో వసూళ్లు వస్తుంటాయి. అలాంటిది డెబ్యూ హీరో సినిమాకే ఈ స్థాయి కలెక్షన్లు నమోదవుతుండటం మామూలు విషయం కాదు.

Other news